శుక్రవారాల్లో వాహనాల కదలికలపై కొత్త గైడ్‌లైన్స్
- September 29, 2022
దోహా: FIFA వరల్డ్ కప్ ఖతార్ 2022ని దృష్టిలో పెట్టుకొని సెంట్రల్ దోహాలో ట్రాఫిక్‌ను తగ్గించేందుకు వెహికల్ ప్లేట్ మేనేజ్‌మెంట్ ప్లాన్‌ను అమలు చేస్తున్నట్లు కార్నిచ్ స్ట్రీట్ క్లోజర్ ఇంప్లిమెంటేషన్ ప్లాన్ కోసం కమిటీ ప్రకటించింది. సెప్టెంబర్ 30 నుండి ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు అమలు చేయబడే ఈ ప్రణాళికలో భాగంగా సాధారణ, రవాణా నంబర్ ప్లేట్లు, బ్లాక్ ప్రైవేట్ రవాణా నంబర్ ప్లేట్లు ఉన్న వాహనాలను సెంట్రల్ దోహా నుండి దూరంగా మళ్లిస్తారు. ఉత్తర దోహా నుండి అల్ ఖాఫ్జీ స్ట్రీట్, పశ్చిమ-దక్షిణ దోహా నుండి సి-రింగ్ రోడ్, తూర్పు నుండి కార్నిచ్ స్ట్రీట్ వరకు ఈ ప్రణాళిక పరిధిలోకి వస్తుందని కమిటీ తెలిపింది. ఒక వాహనాన్ని మాత్రమే కలిగి ఉన్న వ్యక్తులు (సాధారణ రవాణా నంబర్ ప్లేట్ లేదా ప్రైవేట్ బ్లాక్ నంబర్ ప్లేట్), మొవాసలాత్, ఖతార్ రైల్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వాహనాలు, అత్యవసర వాహనాలకు మినహాయింపునిచ్చారు. నిబంధనలు పాటించని వాహనాలకు ఆర్టికల్ 49 ఆధారంగా సంబంధిత అధికారులు జరిమానాలు జారీ చేస్తారని కమిటీ హెచ్చరించింది.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







