భారత్ కరోనా అప్డేట్
- September 29, 2022
న్యూ ఢిల్లీ: భారత్‌లో కొత్తగా 4,272 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా నుంచి నిన్న 4,474 మంది కోలుకున్నట్లు వివరించింది. దేశంలో ప్రస్తుతం ఆసుపత్రులు/హోం క్వారంటైన్లలో 40,750 మంది చికిత్స తీసుకుంటున్నారని పేర్కొంది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.35 శాతంగా ఉందని చెప్పింది. ప్రస్తుతం రికవరీ రేటు 98.72 శాతంగా ఉందని పేర్కొంది.
ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,40,13,999గా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. వారాంతపు పాజిటివిటీ రేటు 1.51 శాతంగా ఉందని చెప్పింది. ఇప్పటివరకు దేశంలో 218.17 కోట్ల వ్యాక్సిన్ డోసులు వినియోగించారని చెప్పింది. వాటిలో రెండో వ్యాక్సిన్ డోసులు 94.82 కోట్లు, ప్రికాషన్ డోసులు 20.88 కోట్లు ఉన్నాయని పేర్కొంది.
నిన్న దేశంలో 21,63,248 డోసుల వ్యాక్సిన్లు వేశారని చెప్పింది. ఇప్పటి వరకు దేశంలో 89.47 కోట్ల కరోనా పరీక్షలు చేశారని తెలిపింది. నిన్న దేశంలో 3,16,916 కరోనా పరీక్షలు చేసినట్లు వివరించింది.
తాజా వార్తలు
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి







