స్కూల్స్ ను విజిట్ చేసే పేరెంట్స్ కు గ్రీన్ పాస్ కంపల్సరీ
- September 29, 2022
షార్జా: షార్జాలో స్కూల్స్ ను విజిట్ చేసే పేరెంట్స్ కు తప్పనిసరిగా గ్రీన్ పాస్ ఉండాలని షార్జా ప్రైవేట్ ఎడ్యుకేషన్ అథారిటీ (SPEA) నిబంధన పెట్టింది. గ్రీన్ పాస్ అంటే దాని ఉద్దేశం కరోనా నెగిటివ్ ఉన్నట్లు సర్టిఫై చేయటమన్న మాట. అల్ హోస్న్ యాప్‌లో గ్రీన్ పాస్ కలిగి ఉంటేనే పేరెంట్స్ ను స్కూల్ లో అనుమతిస్తారు. కరోనా నెగిటివ్ రిపోర్ట్ అప్ లోడ్ చేసే ఆటో మేటిక్ యాప్ లో వారికి గ్రీన్ పాస్ వచ్చేస్తుంది. అదే విధంగా వ్యాక్సిన్ వేసుకున్న వారికి కూడా 30 రోజుల పాటు గ్రీన్ పాస్ వాలిడిటీ ఉంటుంది. పిల్లలకు కరోనా ఎఫెక్ట్ లేకుండా ఉండేందుకే ఈ నిబంధన పెట్టినట్లు షార్జా ప్రైవేట్ ఎడ్యుకేషన్ అథారిటీ (SPEA) తెలిపింది. ఇక స్కూల్ లోని ఓపెన్ ప్లేస్ లలో కచ్చితంగా మాస్క్ ధరించాల్సిన అవసరం లేదని తెలిపింది. కరోనా లక్షణాలు ఉన్న వారైతే కచ్చితంగా మాస్క్ పెట్టుకోవాల్సిందేనని సూచించింది. టీచర్స్, స్టాఫ్, పేరెంట్స్ ప్రతి ఒక్కరూ పిల్లలకు కరోనా సోకకుండా వీలైనన్నీ జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కరోనా మొదలైన నాటి నుంచి మొదటి సారి స్కూల్ లోకి బుధవారం విద్యార్థులను మాస్క్ లేకుండానే అనుమతించటం విశేషం.
నిబంధనల సడలింపు
- కరోనా ఐసోలేషన్ ను ఐదు రోజులకు తగ్గించారు.
- కరోనా లక్షణాలుంటేనే పీసీఆర్ టెస్ట్. లేదంటే అవసరం లేదు.
- స్కూల్ లోని క్లాస్ రూమ్ లు, ఆవరణను ఎప్పటికప్పుడు శుభ్రపరటం, శానిటైజేషన్ చేయటం.
తాజా వార్తలు
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు
- తమిళనాడులో బయటపడ్డ భారీ జాబ్ స్కామ్
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!
- బర్కాలో స్పెషల్ ఆపరేషన్..భారీగా డ్రగ్స్ స్వాధీనం..!!
- కువైట్ లో రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాలు..!!
- ప్రాణాలను కాపాడేందుకే అత్యవసర రక్తదాన కాల్స్..!!
- సౌదీ అరేబియాలో స్నాప్చాట్ కు యువత ఫిదా..!!
- స్నేహితులు మోసం..వేదన తట్టుకోలేక డాక్టర్ ఆత్మహత్య







