కొత్త నిబంధనలతో హోమ్ డెలివరీ కంపెనీలకు ఇబ్బందులు

- September 29, 2022 , by Maagulf
కొత్త నిబంధనలతో హోమ్ డెలివరీ కంపెనీలకు ఇబ్బందులు

కువైట్: హోమ్ డెలివరీ సెక్టార్‌లోని కార్మికులకు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ విధించిన కొత్త నిబంధనలు అమల్లోకి రావడానికి ఇంకా నలభై ఎనిమిది గంటలు ఉండగానే.. ఈ రంగంలో పనిచేస్తున్న కంపెనీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. కంపెనీల అధికారులు, రెస్టారెంట్ యజమానులు, తమ కంపెనీల విధానాలను సరిచేయడానికి, ప్రత్యేకించి డెలివరీ చేసే వారికి హెల్త్ కార్డుల అమలు గడువును పొడిగించాలని డిమాండ్ చేస్తున్నారు. అనేక డెలివరీ కంపెనీలు మంత్రిత్వ శాఖ విధించిన కొత్త నిబంధనలకు మారేందుకు సమయం సరిపోదని చెబుతున్నాయి. డెలివరీ కంపెనీల సమాఖ్య అధిపతి ఇబ్రహీం అల్-తువైజ్రీ మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో వచ్చే శనివారం నాటికి కొత్త నిబంధనలు అమల్లోకి తేవడం కష్టమన్నారు. దీంతో పెద్ద సంఖ్యలో డెలివరీ కంపెనీలు పనిని నిలిపివేసే యోచనలో ఉన్నాయన్నారు. కువైట్ మునిసిపాలిటీ, పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ న్యూట్రిషన్, ఇతర అధికారిక అధికారుల నుంచి ఫుడ్ డెలివరీ ఉద్యోగుల హెల్త్ కార్డ్ పొందడానికి కనీసం 3 వారాల నుండి ఒక నెల వరకు సమయం పడుతుందన్నారు. ఫుడ్ డెలివరీ కంపెనీలు ఎదుర్కొంటున్న ప్రధాన అడ్డంకులలో ఇది ఒకటన్నారు. వచ్చే ఏడాది ప్రారంభం వరకు నిర్ణయం అమలును వాయిదా వేస్తే బాగుంటుందన్నారు. ఫుడ్ డెలివరీ రంగంలో డ్రైవర్ల కొరత తీవ్రంగా ఉన్నందున, కొత్త చట్టం అమలును వాయిదా వేయాలని కోరారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com