ఫిఫా వరల్డ్ కప్ కోసం వచ్చే విదేశీయులకు కోవిడ్ పాలసీ ప్రకటించిన ఖతార్

- September 30, 2022 , by Maagulf
ఫిఫా వరల్డ్ కప్ కోసం వచ్చే విదేశీయులకు కోవిడ్ పాలసీ ప్రకటించిన ఖతార్

ఖతార్: ప్రపంచ ఫుట్ బాల్ ఫిపా వరల్డ్ కప్ ఈ ఏడాది ఖతార్ లో జరగనున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ఐతే ఫుట్ బాల్ మ్యాచ్ లు చూసేందుకు పెద్ద ఎత్తున విదేశాల నుంచి అభిమానులు రానున్నారు. దీంతో మళ్లీ కరోనా ప్రభావం ఉండకుండా ఖతార్ జాగ్రత్తలు చేపట్టింది. ఇందులో భాగంగా విదేశీయుల కోసం కోవిడ్ ట్రావెల్ అండ్ రిటర్న్ పాలసీ ప్రకటించింది.

విదేశీ అభిమానులకు నిబంధనలు

  • వ్యాక్సిన్ తో సంబంధం లేకుండా ఖతార్ లోకి వచ్చేముందు కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలి.
  • ఆరేళ్ల కన్నా ఎక్కువ వయసున్న వారెవరైనా సరే 48 గంటల ముందు తీసుకున్న పీసీఆర్ రిజల్ట్ తో పాటు 24 గంటల ముందు చేయించుకున్న రాపిడ్ యాంటిజెన్ టెస్ట్ (RAT) రిజల్ట్ ను అందించాలి. పరీక్ష ఫలితాలను ఎయిర్ పోర్ట్ లోని చెక్-ఇన్ కౌంటర్‌లో సమర్పించాల్సి ఉంటుంది. ఈ టెస్ట్ లను ఏ దేశ పౌరులు ఆ దేశంలో చేయించుకొని ఉండాలి.
  • ఆరేళ్లలోపు పిల్లలు కోవిడ్ టెస్ట్ అవసరం లేదు. ఇక ఖతార్ కు వచ్చే అభిమానులు క్వారంటైన్ లో ఉండాలన్న నిబంధనను తీసేశారు.
  •  ఖతార్‌లో ఉన్నప్పుడు కరోనా వస్తే...పబ్లిక్ హెల్త్ మినిస్ట్రీ గైడ్ లెన్స్ ప్రకారం ఐసోలేట్ చేస్తారు.
  • ఖతార్ చేరుకున్నాక కోవిడ్ టెస్ట్ తప్పనిసరి ఏమీ కాదు.


ప్రత్యేకంగా కాంటాక్ట్ ట్రేసింగ్ అప్లికేషన్

ఖతార్ చేరుకున్న అభిమానులందరూ తప్పనిసరిగా EHTERAZ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. కరోనా నెగిటివ్ ఉన్న వారికి సంబంధించి ఈ యాప్ గ్రీన్ సింబల్ చూపిస్తుంది. యాప్ డౌన్ లోడ్ చేసుకుంటే ఏలాంటి నెగిటివ్ సర్టిఫికెట్ చూపించాల్సిన అవసరం లేదు. యాప్ లో ఒక్కసారి రిపోర్ట్ ను అప్ లోడ్ చేస్తే సరిపోతుంది. ఇక హెల్త్ ఇన్సూరెన్స్ కూడా అభిమానులు తప్పకుండా తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఖతార్ లో ఉన్న సమయంలో ఏదైనా ప్రమాదానికి గురైన, ఎమర్జెన్సీ పరిస్థితి వచ్చిన బీమా తీసుకున్న వారికి ఉచితంగా వైద్య సేవలు అందించనున్నారు. 

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com