షార్జాలో మేఘాలను తాకిన దుమ్ము, ధూళి సుడిగుండం
- September 30, 2022
షార్జా: యూఏఈ లోని షార్జాలో వాతావారణ పరంగా వింత సంఘటన చోటు చేసుకుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా దుమ్ము, దూళి సుడిగుండం అత్యంత పైకి లేస్తూ మేఘాలను తాకింది. ఈ ఘటన ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అరుదుగా కనిపించే దృశ్యం కావటంతో చాలా మంది మొబైల్ లో ఈ సంఘటనను వీడియో తీశారు. నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ (NCM) ఈ వీడియోను తన ట్విట్టర్ లో షేర్ చేసింది. ఒక గరాటు ఆకారంలో దుమ్ము, దూళి మేఘాలను తాకుతున్న దృశ్యం ఆ వీడియోలు స్పష్టంగా కనిపిస్తోంది. షార్జాలో ఎన్నో ఇసుక, దూళి తుపానులు వచ్చినప్పటికీ ఇలాంటి సంఘటన మాత్రం అరుదేనని వాతావారణ శాఖ అధికారులు తెలిపారు. గత పదిరోజుల్లోనే ఇలాంటి ఘటన రెండోసారి జరగటం విశేషం. అటు అల్ బడాయర్‌లో మంచుతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని...హఠాత్తుగా కొండచరియలు విరిగిపడవచ్చని వాతావారణ అధికారులు హెచ్చరించారు. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
తాజా వార్తలు
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!
- ఒమన్ లో చిన్నారిని రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- బహ్రెయన్ లో బీభత్సం సృష్టించిన వర్షాలు..!!
- ఎంపీలకు తేనీటి విందు ఇచ్చిన స్పీకర్ ఓం బిర్లా..
- డిసెంబర్ 31లోపు ఈ పనులు చేయకపోతే భారీ జరిమానా!
- తిరుమల వెళ్లే భక్తులకు ఆర్టీసీ శుభవార్త







