జిటెక్స్ గ్లోబల్ 2022 లో ఫ్లైయింగ్ కారు ప్రదర్శన

- September 30, 2022 , by Maagulf
జిటెక్స్ గ్లోబల్ 2022 లో ఫ్లైయింగ్ కారు ప్రదర్శన

దుబాయ్: వచ్చే నెలలో దుబాయ్‌లో జరగనున్న జిటెక్స్ గ్లోబల్-2022 లో ఫ్లైయింగ్ కారును ప్రదర్శించనున్నారు.ప్రముఖ టెక్, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ జి పెంగ్ (Xpeng) ఈ కారును తయారు చేసింది. ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ , ల్యాండింగ్  ఇది ప్రత్యేకత. ఫ్లయింగ్ కార్ - X2 గా దీనికి పేరు పెట్టారు.దుబాయ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సహకారంతో జి పెంగ్ దీన్ని తయారు చేసింది. పబ్లిక్ రవాణాకు సంబంధించి ఇది భవిష్యత్ లో అద్భుతం సృష్టిస్తుందని కంపెనీ ప్రకటించింది. ఇందులో టూ-సీటర్ తో  పాటు ఇంటెలిజెంట్ ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్ ఉంటుంది. గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణిస్తుంది. తక్కువ దూరంలో ఉండే నగరాలు, ఎమర్జెన్సీ హెల్త్ కండిషన్ లో ఉన్నప్పుడు ఈ కారు ఎంతో ఉపయోగపడుతుందంటున్నారు. జిటెక్స్ గ్లోబల్  2022 ప్రదర్శన అక్టోబర్ 10 నుంచి 14 వరకు దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ (DWTC)లో జరుగుతుంది. ఐదు రోజుల పాటు జరిగే ఈ ఎక్స్ పో కు 170 దేశాల నుంచి లక్ష మంది హాజరవుతారని అంచనా. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com