ఖైతాన్‌లో ఓ ఈజిప్షియన్ దారుణ హత్య

- October 01, 2022 , by Maagulf
ఖైతాన్‌లో ఓ ఈజిప్షియన్ దారుణ హత్య

కువైట్: ఖైతాన్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఒక గుర్తుతెలియని ఈజిప్షియన్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అపార్ట్‌మెంట్‌లోని తెరిచి ఉన్న ఓ ప్లాట్ నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు సమాచారం అందించారని క్రిమినల్ ఎవిడెన్స్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. దీంతో సంఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు.. ప్లాట్ లో ఓ వ్యక్తి హత్యకు గురైనట్లు గుర్తించారు. అతన్నిఈజిప్షియన్ గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. బలమైన వస్తువుతో కొట్టడంతో అతడు చనిపోయినట్లు ప్రాథమికంగా పోలీసులు అంచనా వేశారు. పోస్టుమార్టం నిర్వహించేందుకు వీలుగా అతడి మృతదేహాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ కి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com