రియాద్ లో మొదటిసారిగా సౌదీ గేమ్స్. ఈ నెల 27 నుంచి ప్రారంభం
- October 02, 2022
            రియాద్: అత్యంత వైభవంగా నిర్వహించనున్న సౌదీ గేమ్స్ ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ భారీ ఈవెంట్ కు తొలిసారి రియాద్ అతిథ్యమిస్తోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. కింగ్ సల్మాన్ ఆధ్వర్యంలో జరిగే ఈ గేమ్స్ లో 6000 మంది మహిళ, పురుష అథ్లెట్స్ పాలొననున్నారు. కింగ్ ఫహద్ ఇంటర్నేషనల్ స్టేడియంలో గేమ్స్ నిర్వహిస్తారు. ఈ గేమ్స్ కు కింగ్ సల్మాన్ ఎంతో సపోర్ట్ చేస్తున్నారని స్పోర్ట్స్ మినిస్టర్ అబ్దుల్ అజీజ్ బిన్ తుర్కీ అల్-ఫైసల్ తెలిపారు. వారికి దేశం తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఇక విజేతలకు భారీ మొత్తాన్ని నజరానాగా ఇవ్వనున్నారు. ఇందుకోసం సౌదీ ప్రభుత్వం 200 మిలియన్ రియాలను కేటాయించింది. బంగారు పతకం విజేతలకు మిలియన్, రజత పతక విజేతలు 3 00,000, కాంస్య విజేతలకు 1,00,000 రియాలు బహుమతి ఇవ్వనున్నారు. ఈ గేమ్స్ లో దేశం నలుమాలల నుంచి 200 కన్నా క్లబ్ లు పాల్గొననున్నాయి. ఐదు పారా-స్పోర్ట్స్ తో పాటు 45 వ్యక్తిగత , టీమ్ ఈవెంట్ లు సౌదీ గేమ్స్ లో ప్రేక్షకులను అలరించనున్నాయి.
తాజా వార్తలు
- లండన్‌లో సీఎం చంద్రబాబు–యూకే హైకమిషనర్‌తో భేటీ
 - హెచ్-1బీ వీసా ప్రాసెసింగ్ రీస్టార్ట్..
 - కృష్ణా జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన..
 - భారత్ DMF డిజిటల్ ఐకాన్ అవార్డ్స్ 2025
 - బహ్రెయిన్-భారత్ చర్చలు..వాణిజ్యం, భద్రత మరియు ప్రాంతీయ శాంతిపై దృష్టి..!!
 - బిగ్ టికెట్ డ్రాలో Dh25 మిలియన్ల గ్రాండ్ ప్రైజ్‌ను గెలుచుకున్న భారతీయ ప్రవాసుడు..!!
 - యూనిఫైడ్ GCC వీసాపై క్లారిటీ ఇచ్చిన సౌదీ పర్యాటక మంత్రి..!!
 - కువైట్ రైల్వే ప్రాజెక్ట్.. రైల్వే స్టేషన్ మొదటి దశ పూర్తి..!!
 - సముద్ర కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసిన ఖతార్..!!
 - ఒమన్ చోరీ కేసులలో పలువురి అరెస్టు..!!
 







