జనవరి నుండి బహ్రెయిన్‌లో 1,000 డ్రగ్ కేసులు నమోదు
- October 04, 2022
బహ్రెయిన్: 2022 జనవరి నెల నుండి దాదాపు 1,000 డ్రగ్ కేసులు నమోదైనట్లు అంతర్గత మంత్రిత్వ శాఖలోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ నివేదిక తెలిపింది. గత మూడు నెలల్లోనే (జూలై, ఆగస్టు, సెప్టెంబర్) డ్రగ్ కేసుల విచారణలో భాగంగా డెబ్బై మూడు మంది నిందితులను అరెస్టు చేయగా.. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ మార్కెట్ విలువ వేల బహ్రెయిన్ దినార్లు ఉంటుందని నివేదిక పేర్కొంది. రాజ్యంలోకి డ్రగ్స్ స్మగ్లింగ్‌తో పాటు స్థానికంగా మాదకద్రవ్యాల విక్రయం, వినియోగాన్ని అరికట్టడానికి డిపార్ట్మెంట్ రూపొందించిన తాజా వ్యూహాలే కేసుల సంఖ్య పెరిగేందుకుకు కారణమని నివేదిక స్పష్టం చేసింది. 2021లో 1,048 డ్రగ్స్ కేసులు నమోదు కాగా.. 1,229 మందిని అరెస్టు చేసినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ నివేదిక తెలిపింది. పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, మస్జీదులు, సామాజిక క్లబ్‌లు.. వివిధ గవర్నరేట్లలో ఉపన్యాసాలు, ప్రదర్శనలు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా మాదకద్రవ్యాల వినియోగంపై అవగాహన కల్పిస్తున్నట్లు బ్రిగేడియర్ జనరల్ అబ్దుల్ అజీజ్ మయూఫ్ తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో అరబ్ పార్లమెంట్ స్పీకర్‌తో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్‌లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్‌కు ఆహ్వానం
- దుబాయ్ పోలీసుల్లో 36 ఆర్పీఏ రోబోలు..
- తెలంగాణలో కొత్త క్రిమినల్ చట్టాల అమలు పై NCRB డైరెక్టర్ సమీక్ష
- ఏపీలో వేసవిని తలపిస్తున్న ఎండలు
- కల్తీ మద్యం తాగి 14 మంది మృతి..







