దుబాయ్‌లో హిందూ దేవాలయం ప్రారంభం

- October 06, 2022 , by Maagulf
దుబాయ్‌లో హిందూ దేవాలయం ప్రారంభం

దుబాయ్: దుబాయ్‌లో నూతనంగా నిర్మించిన హిందూ దేవాలయాన్ని బుధవారం భక్తులకోసం అధికారికంగా తెరిచారు. ఈ ఆలయం బెబెలీ అలీ ప్రాంతంలో ఉంది. ఈ ఆలయాన్ని మినిస్టర్ ఆఫ్ టాలరెన్స్ మంత్రి షేక్ నహ్యాన్ బిన్ ముబారక్ అల్ నహ్యాన్ ముఖ్యఅతిథిగా, యూఏఈలోని భారత రాయబారి సంజయ్ సుధీర్ గౌరవ అతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో సామాజిక నియంత్రణ, లైసెన్సింగ్ ఏజెన్సీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CDA) ఒమర్ అల్-ముత్తన్న, హిందూ దేవాలయం దుబాయ్ ధర్మకర్త రాజు ష్రాఫ్ పాల్గొన్నారు. 200 మంది ప్రముఖులు, రాయబారులు, స్థానిక సంఘం నాయకులు ఈ ప్రారంభ వేడుకలకు హాజరయ్యారు. ఈ నూతన ఆలయం దీపావళి ఉత్సవాల తరువాత అందరికీ అందుబాటులో ఉంటుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. దుబాయ్‌లోని జెబెల్ అలీలోని వర్షిప్ విలేజ్ ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం కోసం యూఏఈ ప్రభుత్వం 2019లో భూమిని కేటాయించింది. అయితే కోవిడ్ మహమ్మారి కారణంగా ఆలయ నిర్మాణానికి మూడేళ్లు పట్టింది. గురు గ్రంథ్ సాహిబ్‌తో పాటు , వెంకటేశ్వర స్వామి,శివుడు, కృష్ణుడు, గణేష్, షిరిడీ సాయి, బాబా,మహాలక్ష్మి తో సహా 16 మంది దేవత,దేవతామూర్తి లను ఈ ఆలయంలో ఉంచారు.ఈ ఆలయాన్ని సందర్శించాలనుకునేవారు ఆలయ వెబ్‌సైట్ ద్వారా ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చు. సందర్శకులు, భక్తులు వారి పేరు, మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడీ, సందర్శకుల సంఖ్యను అందించిన తర్వాత క్యూఆర్ టెక్నాలజీతో అరగంటలో స్లాట్‌లను బుక్ చేసుకోవచ్చని ఆలయ వర్గాలు వెల్లడించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com