ట్రక్కులు ఢీకొని ఇద్దరు ఈజిప్షియన్లు మృతి
- October 06, 2022
కువైట్: సబా అల్-అహ్మద్ ప్రాంతంలో రెండు ట్రక్కులు ఢీకొన్న ఘటనలో ఇద్దరు ఈజిప్షియన్లు మరణించారని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. రెండు ట్రక్కలు ఢీకొన్న ఘటనపై సమాచారం అందగానే అగ్నిమాపక సిబ్బంది, భద్రత, అత్యవసర సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నాయన్నారు. ఓ ట్రక్కు డ్రైవర్, అతని సహచరుడు అప్పటికే గాయాలతో మరణించారని, మరో ట్రక్కు డ్రైవర్కు గాయాలవ్వగా సమీప ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. మృతులను ఈజిప్షియన్లుగా గుర్తించామన్నారు. ప్రమాదానికి గల కారణం తెలియరాలేదన్నారు. భద్రత, అగ్నిమాపక సిబ్బంది.. రెండు ట్రక్కులను రోడ్డుపై నుండి తొలగించి వాహనాల రాకపోకలను కోసం క్లియర్ చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- కువైట్ లో ఇద్దరు భారతీయులు మృతి..!!
- జిసిసి 'వన్-స్టాప్' ట్రావెల్ సిస్టమ్ ప్రారంభం..!!
- రియాద్ లో ఆఫాక్ ఆర్ట్స్ అండ్ కల్చర్ అకాడమీ ప్రారంభం..!!
- ‘వన్ ఓషన్, అవర్ ఫ్యూచర్ ’ గ్రాండ్ సక్సెస్..!!
- ఒమన్ ఎయిర్ కొత్త సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ కంటి సమస్యలపై స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ను పరిశీలించిన పీఎం..!!







