థాయిలాండ్‌లో భయానక ఘటన.. కాల్పుల్లో 34 మంది మృతి

- October 06, 2022 , by Maagulf
థాయిలాండ్‌లో భయానక ఘటన.. కాల్పుల్లో 34 మంది మృతి

థాయిలాండ్‌: థాయిలాండ్‌లో భయానక ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ఇవాళ విచక్షణారహితంగా కాల్పులు జరిపి 34 మంది ప్రాణాలు తీశాడు. వారిలో 22 మంది చిన్నారులు ఉన్నారు.థాయిలాండ్‌లోని నోంగ్ బువా లమ్ ఫూ ప్రావిన్స్ లోని ప్రీ స్కూల్ చైల్డ్ డే కేర్ సెంటర్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. మాజీ పోలీసు అధికారే ఈ దారుణానికి పాల్పడినట్లు గుర్తించామన్నారు. అతడిని ఉన్నతాధికారులు కొన్ని రోజుల క్రితమే విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు చెప్పారు.

అతడి కోసం గాలింపు చర్యలు ప్రారంభించామని వివరించారు. కాల్పులతో పాటు కొందరిని నిందితుడు కత్తితో పొడిచి చంపినట్లు చెప్పారు. అతడు ఈ ఘటనకు ఎందుకు పాల్పడ్డాడన్న విషయంపై స్పష్టత లేదని తెలిపారు. ఓ ట్రక్కులో నిందితుడు తిరుగుతూ కనపడ్డాడని అన్నారు. పలు ప్రాంతాల్లో అలర్ట్ ప్రకటించామని చెప్పారు. కాగా, థాయిలాండ్ లో ఇటువంటి కాల్పుల ఘటనలు పెరిగిపోతున్నాయి. నఖోన్ రాట్చసిమాలో 2020లో ఓ ఆర్మీ అధికారి కాల్పులు జరిపి 21 మందిని చంపాడు. ఆ ఘటనలో చాలా మందికి గాయాలయ్యాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com