యూఏఈ వెళ్లే భారతీయులకు 'వీసా ఆన్ అరైవల్' సౌకర్యం..
- October 06, 2022
యూఏఈ: యూఏఈ వెళ్లే 70 దేశాల వారికి వీసా ఆన్ అరైవల్ సౌకర్యం ఉంటుంది. ఇక గల్ఫ్ దేశాల పౌరులకు యూఏఈ వెళ్లేందుకు వీసా అవసరం లేదు. వారికి ఫ్రీ ఎంట్రీకి అనుమతి ఉంటుంది. కనుక యూఏఈ వెళ్లే 'వీసా ఆన్ అరైవల్' సౌకర్యం ఉన్న 70 దేశాలతో పాటు GCC దేశాల వారికి వీసాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ, మిగత దేశాల వారికి తప్పనిసరిగా ప్రీ-ట్రావెల్ వీసా కావాల్సిందే. ఇక భారతీయుల విషయానికి వస్తే.. మనోళ్లకు సాధారణ ఇండియన్ పాస్‌పోర్టు తో పాటు యూఎస్ జారీ చేసిన విజిట్ వీసా లేదా అమెరికన్ గ్రీన్‌కార్డు లేదా బ్రిటన్ జారీ చేసిన రెసిడెన్సీ వీసా లేదా ఈయూ నివాస వీసా ఉండాలి. ఈ నాలుగు సందర్భాల్లో మాత్రమే భారతీయులకు 'వీసా ఆన్ అరైవల్' సౌకర్యం ఉంటుంది.
ఇక ఇలా పొందిన వీసాతో ఆ దేశంలో 14 రోజుల పాటు బస చేసేందుకు వీలు ఉంటుంది. అలాగే మరో 14 రోజుల పాటు వీసా వాలీడిటిని పొడిగించుకునే వెసులుబాటు కూడా వీసాదారులకు ఉంది. ఇలా మొత్తంగా ఆ వీసాపై 28 రోజుల పాటు యూఏఈలో ఉండొచ్చు. అయితే, ఈ వీసా పొందేందుకు కొన్ని షరతులు ఉన్నాయి. అవేంటంటే.. వీసాదారుడి పాస్‌పోర్ట్ తప్పకుండా 6 నెలల వాలీడిటిని కలిగి ఉండాలి.అలాగే యూఎస్, ఈయూ, యూకే రెసిడెన్సీ వీసాల గడువు కూడా 6 నెలలు ఉండాల్సిందే. వీసాదారుడు యూఏఈలో కాలుపెట్టినప్పటి నుంచి వాటి గడువులను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది.ఇక వీసా కాస్ట్ వచ్చేసి 14 రోజులకు గాను 120 దిర్హాములు ఉంటుంది. మరో 14 రోజులు పొడిగించుకునేందుకు అదనంగా 250 దిర్హాములు చెల్లించాలి.
తాజా వార్తలు
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్
- President of Senegal receives Al Zeyoudi in Dakar to discuss expanding trade and investment partnership
- యువత కోసం ట్రావెల్-ఫస్ట్ డిజిటల్ కార్డు
- ఢిల్లీలో భారీ వర్షాలు..ఎయిర్‌పోర్ట్‌లో వరద నీరు
- సౌదీ అరేబియాలో కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పర్యటన
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్‌కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ







