నేడే రమదాన్ చంద్ర దర్శనం

- June 16, 2015 , by Maagulf
నేడే రమదాన్ చంద్ర దర్శనం

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యు.ఎ.ఈ.) ఇంకా ఇతర అరబ్ దేశాలు దృష్టి అంతా  కేంద్రీకరించి నేడు రమదాన్ చంద్రదర్శనానికై నిరీక్షిస్తున్నై! ఇందుకోసం యు.ఎ.ఈ. యొక్క మూన్ సైటింగ్ కమిటీ, ఇంకా సౌదీ అరేబియా యొక్క సుప్రీం జూడిషియారీ కౌన్సిల్, వారి వారి దేశాలలో సమావేశం కానున్నాయి.
   మహమ్మద్ ప్రవక్త మక్కా నుండి మదీనాకి వెళ్ళిన చాంద్రమాన సంవత్సరంలో ప్రారంభమైన హిజ్రీ కేలండరును పాటించే అనేక పశ్చిమాది ముస్లిం దేశాలు కూడా రమదాన్ ప్రారంభ ప్రకటన కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాయి.
   యు.ఎ.ఈ., సౌదీ అరేబియా రెండు దేశాలలోని కమిటీలు నేడు మగ్రీబ్ ప్రార్ధన అనంతరం సమావేశమౌతాయి. ఆయా దేశాల వివిధ ప్రాంతాలలో చంద్ర దర్శనాన్ని గురించిన నిర్ధారణ అనంతరం, ఇషా ప్రార్ధన తరువాత ఇంచుమించు 9 గం. లకు రమదాన్ చంద్రదర్శనం ప్రకటించబడుతుంది.
    నేడు చంద్రదర్శనం కాకుంటే, రమదాన్ గురువారం ప్రకటించబడుతుంది.
    యు.ఎ.ఈ. లో ప్రజలు రమదాన్ ప్రార్ధనలలో మరింత సమయం గడపడానికి వీలుగా ప్రభుత్వ మరియు ప్రైవేటు  రంగాలలో పనిగంటలు తగ్గించబడ్డాయి. ఈ సంవత్సరం ప్రైవేటు రంగ ఉద్యోగుల పని గంటలు రెండు గంటలు తగ్గించబడ్డాయి.


--సి.శ్రీ(దుబాయ్) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com