సౌదీలో 135 మంది స్మగ్లర్లు అరెస్ట్.. భారీగా డ్రగ్స్ స్వాధీనం
- October 07, 2022
రియాద్ : రాజ్యంలోకి భారీ మొత్తంలో డ్రగ్స్‌ను స్మగ్లింగ్ చేసేందుకు చేసిన పలు ప్రయత్నాలను విఫలం చేసినట్లు సౌదీ సరిహద్దు గార్డ్స్ తెలిపారు. ఈ ఘటనల్లో మొత్తం 135 మంది డ్రగ్ స్మగ్లర్లను అరెస్ట్ చేశామన్నారు. ఇందులో 36 మంది పౌరులు, 99 మంది అక్రమ నివాసితులు ఉన్నారన్నారు. నజ్రాన్, జజాన్, అసిర్, తబుక్, తూర్పు ప్రావిన్స్‌లోని బోర్డర్లలో మొత్తం 64.4 టన్నుల డ్రగ్స్ ను పెట్రోలింగ్ బృందాలు స్వాధీనం చేసుకున్నాయని సౌదీ బోర్డర్ గార్డ్స్ జనరల్ డైరెక్టరేట్ ప్రతినిధి కల్నల్ మిస్ఫర్ అల్-కిరైనీ తెలిపారు. ఇందులో 1009 కిలోల హషీష్, 62,000 యాంఫెటమైన్ మాత్రలు, మెడికల్ ప్రిస్క్రిప్షన్ అవసరమయ్యే 425,620 మాత్రలు ఉన్నాయన్నారు. స్మగ్లర్లపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వీలుగా వారిని సంబంధిత అధికారులకు అప్పగించినట్లు అల్-కిరైనీ వెల్లడించారు.
తాజా వార్తలు
- మీ బ్యాంక్ వెబ్సైట్ అడ్రస్ మారింది.. ఇకపై .com, .co.in ఉండవు
- విశాఖపట్నం కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు
- AI చాట్‌బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం
- సౌతాఫ్రికా పై భారత్-ఏ ఘన విజయం
- వాహనాలపై జెండాలు..పోలీసుల హెచ్చరికలు..!!
- డిసెంబర్ చివరిలో కువైట్ జియోపార్క్ ప్రారంభం..!!
- GCC ‘వన్-స్టాప్’ ప్రయాణానికి బహ్రెయిన్ మొదటి కేంద్రం..!!
- సౌదీ అరేబియాలో రీసెర్చ్ పై SR29.48 బిలియన్లు ఖర్చు..!!
- యూఏఈ లాటరీలో ప్రతి టికెట్‌కీ 100 మిలియన్ దిర్హాముల విజయం..!!







