హమద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా హషీష్‌ స్వాధీనం

- October 07, 2022 , by Maagulf
హమద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా హషీష్‌ స్వాధీనం

దోహా: ఖతార్‌లోకి హషీష్‌ను అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం (హెచ్‌ఐఏ) కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు. రెండు బాక్సుల్లో తరలిస్తున్న 1.95 కిలోల హషీష్‌ను స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. ఈ మేరకు కస్టమ్స్ సోషల్ మీడియాలో ఫోటోలు, వివరాలను షేర్ చేశారు. గత గురువారం కూడా హషీష్ స్మగ్లింగ్ ప్రయత్నాన్ని హెచ్ఐఏ అధికారులు అడ్డుకొని.. 1.85 కిలోల హషీష్ ను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com