9 సంవత్సరాల గరిష్ఠ స్థాయికి దుబాయ్ రియల్ ఎస్టేట్ అమ్మకాలు

- October 07, 2022 , by Maagulf
9 సంవత్సరాల గరిష్ఠ స్థాయికి దుబాయ్ రియల్ ఎస్టేట్ అమ్మకాలు

దుబాయ్: దుబాయ్ రియల్ ఎస్టేట్ అమ్మకాలు సెప్టెంబర్ నెలలో 9 సంవత్సరాల గరిష్ఠ స్థాయికి చేరాయి. సెప్టెంబర్‌లో రియల్ ఎస్టేట్ లావాదేవీలు 13.34 శాతం పెరిగి 8,649కి చేరాయి. అదే సమయంలో డీల్‌ల విలువ 23.04 శాతం పెరిగి 24.42 బిలియన్‌ దిర్హామ్‌లకు చేరుకుంది. 2013 తర్వాత ఈ స్థాయిలో వృద్ధి నమోదు కావడం ఇదే తొలిసారని ప్రాపర్టీ ఫైండర్ విడుదల చేసిన తాజా నివేదికలో పేర్కొంది.  ఆఫ్-ప్లాన్, సెకండరీ మార్కెట్‌లో డిమాండ్ పెరగడం వల్ల సెప్టెంబర్‌లో ఆస్తి లావాదేవీల విలువ తొమ్మిదేళ్ల గరిష్ఠ స్థాయికి చేరుకుందని నివేదిక వెల్లడించింది. నివేదిక  డేటా ప్రకారం.. ప్రస్తుత ఆస్తుల లావాదేవీలు విలువ పరంగా 32.39 శాతం పెరిగాయి. ఆఫ్-ప్లాన్ మార్కెట్ సెప్టెంబర్‌లో Dh9.755 బిలియన్ల విలువైన 4,439 ఆస్తుల లావాదేవీలు జరిగాయి. వాల్యూమ్ పరంగా 80.23 శాతం, విలువ పరంగా 94.13 శాతం పెరుగుదల నమోదైంది. ఈ సందర్భంగా ప్రాపర్టీ ఫైండర్‌లో యూఏఈ కంట్రీ మేనేజర్ స్కాట్ బాండ్ మాట్లాడుతూ.. యూఏఈ చురుకైన వ్యూహాలు, ఆకర్షణీయమైన విధానాలు, గోల్డెన్ వీసా చొరవ, బలీయమైన పెట్టుబడి విధానాలు దుబాయ్ రియల్ ఎస్టేట్ అమ్మకాల వృద్ధికి కారణాలుగా పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com