ఉద్యోగ ఒప్పందాల చట్టంలో సవరణలు చేసిన యూఏఈ

- October 08, 2022 , by Maagulf
ఉద్యోగ ఒప్పందాల చట్టంలో సవరణలు చేసిన యూఏఈ

యూఏఈ: ఉపాధి సంబంధాల నియంత్రణకు సంబంధించిన డిక్రీ-చట్టానికి మానవ వనరులు, ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ (MoHRE) సవరణలు చేసింది. రాబోయే 50 సంవత్సరాల యూఏఈ అభివృద్ధి డిమాండ్‌కు అనుగుణంగా నిబంధనలు, చట్టాలను అభివృద్ధి చేయడం కొనసాగిస్తోందని MoHRE మంత్రి డాక్టర్ అబ్దుల్‌రహ్మాన్ అల్ అవార్ అన్నారు. చట్టాలు, నిబంధనలు తమ వ్యాపార వాతావరణం స్థిరత్వానికి మద్దతునిస్తాయన్నారు. కొత్త నిబంధనలు యూఏఈ అధునాతన అభివృద్ధి నమూనాను అనుసరిస్తాయని.. మానవ హక్కులను గౌరవించడం, యూఏఈ నిరంతర పురోగతి, స్థిరత్వం, మార్గదర్శక స్థాయికి హామీ ఇస్తుందన్నారు. కొత్త సవరణలు వ్యాపార యజమానులు, ప్రతిభావంతులకు మద్దతుగా నిలుస్తుందన్నారు. కార్మిక మార్కెట్లో వ్యాపారం, ఉత్పాదకత, స్థితిస్థాపకతను సులభతరం చేసే మెకానిజమ్‌ల అధునాతన పర్యావరణ వ్యవస్థను సృష్టిస్తాయన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com