బహ్రెయిన్‌లో నేడు, రేపు పొగమంచు

- October 08, 2022 , by Maagulf
బహ్రెయిన్‌లో నేడు, రేపు పొగమంచు

మనామా: కొన్ని ప్రదేశాలలో నేడు, రేపు పొగమంచు కురిసే అవకాశం ఉన్నదని, దీంతో వాతావరణం తేమతో కూడి ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానంగా తూర్పు వైపున 5 నుండి 10 నాట్లు, పగటిపూట కొన్నిసార్లు 10 నుండి 15 నాట్‌లకు గాలి తీవ్రత చేరుకుంటుందని పేర్కొంది. వీటి కారణంగా పేలవమైన దృశ్యమానత ఉంటుందని హెచ్చరించింది. అలాగే సముద్రపు అలలు 1 నుండి 3 అడుగులు మేర ఉంటాయని తెలిపింది. ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 37º C నుంచి కనిష్టంగా 25º C వరకు ఉంటాయని, తేమ గరిష్ఠంగా 98 %, కనిష్ఠంగా 45% ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com