సెప్టెంబరులో మంత్రిత్వ శాఖకు 8,191 రిక్రూట్‌మెంట్ అభ్యర్థనలు

- October 08, 2022 , by Maagulf
సెప్టెంబరులో మంత్రిత్వ శాఖకు 8,191 రిక్రూట్‌మెంట్ అభ్యర్థనలు

దోహా: కార్మిక మంత్రిత్వ శాఖకు సెప్టెంబర్‌లో 8,191 కొత్త రిక్రూట్‌మెంట్ అభ్యర్థనలు వచ్చాయి. ఈ మేరకు మంత్రిత్వ శాఖ నెలవారీ బులెటిన్‌లో ప్రచురించింది. ఇందులో 3,910 అభ్యర్థనలను ఆమోదించినట్లు.. 4,281 అభ్యర్థనలను తిరస్కరించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. వృత్తిని సవరించాలనే అభ్యర్థనలు 5,015 వరకు వచ్చాయని, వాటిలో 3,990 అభ్యర్థనలను  ఆమోదించామని, 1,025 అభ్యర్థనలను తిరస్కరించినట్లు పేర్కొంది. వర్క్ పర్మిట్ల అభ్యర్థనల సంఖ్య దాదాపు 2,175కి చేరుకున్నాయి.  ఇందులో పర్మిట్‌ను పునరుద్ధరించడానికి 913 అభ్యర్థనలు, కొత్త పర్మిట్ జారీ చేయడానికి 907 అభ్యర్థనలు, జారీ చేసిన పర్మిట్‌లను రద్దు చేయడానికి 353 అభ్యర్థనలు ఉన్నాయన్నారు. రిక్రూట్‌మెంట్ కార్యాలయాలపై సుమారు 47 తనిఖీ రౌండ్‌లను నిర్వహించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. సెప్టెంబరులో లేబర్ ఇన్‌స్పెక్షన్ డిపార్ట్‌మెంట్ ఖతార్‌లో లేబర్ మార్కెట్‌ను నియంత్రించడానికి.. సంబంధించిన చట్టాలు, మంత్రివర్గ నిర్ణయాలను పర్యవేక్షించడానికి ఇంటెన్సివ్ ఇన్‌స్పెక్షన్ క్యాంపెయిన్‌లను నిర్వహించిందన్నారు. వివిధ ప్రాంతాలలో మొత్తం 4,560 తనిఖీలు నిర్వహించి ..1,216 ఉల్లంఘనలు, 473 హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపింది. లేబర్ ఫిర్యాదులకు సంబంధించి..  కార్మికుల నుండి 3653 ఫిర్యాదులు రాగా..  601 ఫిర్యాదులను పరిష్కరించామని, 1,327 ఫిర్యాదులు కమిటీలకు రిఫర్ చేశామని, దాదాపు 1,725 ఫిర్యాదులు మిగిలి ఉన్నాయన్నారు.  గత నెలలో వివాద పరిష్కార కమిటీలకు దాదాపు 1,327 కేసులను సూచించామన్నారు. కార్మిక వివాద పరిష్కార కమిటీలు దాదాపు 376 కేసులకు సంబంధించి నిర్ణయాలు జారీ చేయగా.. ఇ కా దాదాపు 610 కేసులు ప్రాసెస్‌లో ఉన్నాయన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com