6 నెలల్లో ప్రభుత్వ సర్వీసుల్లో చేరిన 10వేల మంది కువైటీలు
- October 09, 2022
కువైట్ సిటీ: ఈ ఏడాది మొదటి 6 నెలల్లో ప్రభుత్వం దాదాపు 10,000 మంది పురుష, మహిళా పౌరులను నియమించినట్లు అధికారిక గణాంకాల చెబుతున్నాయి. వాటి ప్రకారం.. 9786 మంది పౌరులు రాష్ట్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర-అనుబంధ సంస్థలు, కంపెనీలలో పనిచేస్తున్నారు. ముఖ్యంగా విద్య, విద్యుత్, నీటి మంత్రిత్వ శాఖల్లో అత్యధిక ఉద్యోగులను నియమించారు. అయితే ఆ తర్వాత 1454 మంది పౌరులు ఉద్యోగాన్ని విడిచిపెట్టారు. జనవరి నుండి జూన్ చివరి వరకు ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న పౌరుల సంఖ్యలో నికర పెరుగుదల 8,332 మందిగా ఉంది. పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ యజమానుల ప్రాథమిక డేటా ఇప్పుడు “ఆశల్” సర్వీసు, ఇతర ఎలక్ట్రానిక్ సర్వీసుల్లో అందుబాటులో ఉందని అథారిటీ ప్రకటించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







