కువైట్‌లో 25% తగ్గిన ప్రధాన నేరాలు
- October 09, 2022
కువైట్: గత మూడు నెలల్లో కువైట్‌లో ప్రధాన నేరాలు 25 శాతం తగ్గాయని భద్రతా దళాలు వెల్లడించాయి. హత్యలు, సాయుధ దోపిడీలు, బలవంతపు దొంగతనాలు, భద్రతా సిబ్బంది వలె నటించి వసూళ్లు చేయడం, ఇంటిలో చొరబడటం, తుపాకీలను ఉపయోగించి బెదిరింపులకు పాల్పడటం వంటి నేరాలు ఉన్నాయని తెలిపారు. ప్రధాన నేరాల్లో తగ్గుదల కువైట్‌లో స్థిరమైన భద్రతా ప్రమాణాలను తెలుపుతుందని భద్రతా వర్గాలు పేర్కొన్నాయి. పెద్ద ఎత్తున భద్రతా విస్తరణ, నిరంతర భద్రతా ప్రచారాలు, మాదకద్రవ్యాల వ్యాపారుల అరెస్ట్, సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతం చేయడం వంటి చర్యలతో ఇది సాధ్యమైందని వెల్లడించారు. కువైట్‌లో దాదాపు 3.4 మిలియన్ల విదేశీయులతో సహా 4.6 మిలియన్ల జనాభా ఉంది.
తాజా వార్తలు
- ధర్మ ధ్వజం: అయోధ్య నూతన వైభవం
- టీటీడీకి రూ.2 కోట్లు విరాళం
- సహాంలో పది మంది అరెస్టు..!!
- FIFA అరబ్ కప్ టికెట్ అమ్మకాలు నిలిపివేత..!!
- రిథమిక్ జిమ్నాస్టిక్స్ లో మెరిసిన 9 ఏళ్ల భారతీయ బాలిక..!!
- బహ్రెయిన్ లో గ్లోబల్ ఫుడ్ షో..!!
- యూఏఈలో లోన్ల పై సాలరీ పరిమితి ఎత్తివేత..!!
- వచ్చెనెల 30 నుంచి పది రోజుల పాటు వైకుంఠద్వార దర్శనాలు: TTD ఛైర్మన్
- శంకర నేత్రాలయ USA మిల్వాకీ కార్యక్రమం విజయం 770 మందికి కంటి చూపు
- అంబులెన్స్‌లో మంటలు నలుగురు మృతి







