మాదకద్రవ్యాల వ్యాపారికి 10 సంవత్సరాల జైలు, BD5,000 జరిమానా
- October 09, 2022
బహ్రెయిన్: ఒక డ్రగ్ పెడ్లర్‌కు 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు BD5,000 జరిమానాను అప్పీల్ కోర్ట్ ఖరారు చేసింది. దీంతో పాటు జైలు శిక్ష పూర్తయిన తర్వాత అతడిని దేశం నుంచి బహిష్కరించాలని అధికారులను కోర్టు ఆదేశించింది. ఆసియన్ జాతీయుడైన వ్యక్తి రాజ్యంలో డ్రగ్స్ విక్రయిస్తున్నాడని, పక్కా సమాచారం ఆధారంగా బహ్రెయిన్ పోలీసులు పన్నిన ఉచ్చులో పడ్డాడని కోర్టు ఫైల్స్ చెబుతున్నాయి. రహస్య ఆపరేషన్ ద్వారా అతడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఒక రహస్య ఏజెంట్ అనుమానితుడిని సంప్రదించాడని, BD150 విలువైన 'గంజాయి'ని కొనుగోలు చేయడానికి ఆర్డర్ ఇవ్వగా.. దానికి అనుమానితుడు అంగీకరించాడు. పోలీసుల బృందం నిఘాలో ఉంచిన సల్మాబాద్ ప్రాంతంలో డ్రగ్స్ డెలివరీ చేసేందుకు వచ్చిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ అతనిపై గంజాయి అమ్మకం, మాదకద్రవ్యాలను ఉపయోగించాలనే ఉద్దేశ్యంతో కొనుగోలు చేశాడని అభియోగాలు మోపింది.
తాజా వార్తలు
- ధర్మ ధ్వజం: అయోధ్య నూతన వైభవం
- టీటీడీకి రూ.2 కోట్లు విరాళం
- సహాంలో పది మంది అరెస్టు..!!
- FIFA అరబ్ కప్ టికెట్ అమ్మకాలు నిలిపివేత..!!
- రిథమిక్ జిమ్నాస్టిక్స్ లో మెరిసిన 9 ఏళ్ల భారతీయ బాలిక..!!
- బహ్రెయిన్ లో గ్లోబల్ ఫుడ్ షో..!!
- యూఏఈలో లోన్ల పై సాలరీ పరిమితి ఎత్తివేత..!!
- వచ్చెనెల 30 నుంచి పది రోజుల పాటు వైకుంఠద్వార దర్శనాలు: TTD ఛైర్మన్
- శంకర నేత్రాలయ USA మిల్వాకీ కార్యక్రమం విజయం 770 మందికి కంటి చూపు
- అంబులెన్స్‌లో మంటలు నలుగురు మృతి







