డీఎంకే అధ్యక్షుడిగా ఎంకే స్టాలిన్..
- October 09, 2022
చెన్నై: డీఎంకే (ద్రావిడ మున్నేట్ర కజగం) అధ్యక్షుడిగా ఎంకే స్టాలిన్ రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో తమిళనాడు ముఖ్యమంత్రిని పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మరోవైపు డీఎంకే ప్రధాన కార్యదర్శిగా, కోశాధికారిగా డీఎంకే నేతలు దురై మురుగన్, టీఆర్బాలు ఎన్నికయ్యారు. ముగ్గురు నేతలు రెండోసారి తమ పదవులకు ఎన్నికయ్యారు. సాధారణ కౌన్సిల్ సమావేశంకు హాజరయిన ముఖ్యమంత్రి స్టాలిన్ కు పార్టీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.
డీఎంకే 15వ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ స్థాయిల్లో పార్టీ పదవులకు జరిగిన ఎన్నికల తర్వాత పార్టీ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి పదవులకు ఎన్నుకున్నారు. దివంగత పార్టీ వ్యవస్థాపకుడు ఎం. కరుణానిధి చిన్న కుమారుడు స్టాలిన్. డీఎంకె కోశాధికారి, యువజన విభాగం కార్యదర్శితో సహా అనేక పార్టీ పదవులను నిర్వహించారు. 2018లో కరుణానిధి మరణానంతరం పార్టీ అధ్యక్షుడిగా స్టాలిన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తాజాగా మరోసారి స్టాలిన్ డీఎంకే అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
తాజా వార్తలు
- సల్మాన్ ఖాన్ కేసులో నిందితుడు అన్మోల్ ఇండియాకు అప్పగింత
- ధర్మ ధ్వజం: అయోధ్య నూతన వైభవం
- టీటీడీకి రూ.2 కోట్లు విరాళం
- సహాంలో పది మంది అరెస్టు..!!
- FIFA అరబ్ కప్ టికెట్ అమ్మకాలు నిలిపివేత..!!
- రిథమిక్ జిమ్నాస్టిక్స్ లో మెరిసిన 9 ఏళ్ల భారతీయ బాలిక..!!
- బహ్రెయిన్ లో గ్లోబల్ ఫుడ్ షో..!!
- యూఏఈలో లోన్ల పై సాలరీ పరిమితి ఎత్తివేత..!!
- వచ్చెనెల 30 నుంచి పది రోజుల పాటు వైకుంఠద్వార దర్శనాలు: TTD ఛైర్మన్
- శంకర నేత్రాలయ USA మిల్వాకీ కార్యక్రమం విజయం 770 మందికి కంటి చూపు







