వినియోగ వస్తువుల ధరలను తనిఖీ చేసిన సౌదీ అధికారులు

- October 10, 2022 , by Maagulf
వినియోగ వస్తువుల ధరలను తనిఖీ చేసిన సౌదీ అధికారులు

రియాద్: అక్టోబర్ మొదటి వారంలో కింగ్‌డమ్‌లోని అన్ని ప్రాంతాలలోని మార్కెట్లలో వినియోగ వస్తువుల ధరలను పర్యవేక్షించడానికి 18,000 కంటే ఎక్కువ పర్యటనలు చేసినట్లు సౌదీ అరేబియా వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. తమ పర్యటనలో భాగంగా విక్రయ కేంద్రాలలో వస్తువులు, ఉత్పత్తుల ధరలను తమ బృందాలు 29,000 తనిఖీలను నిర్వహించాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. 278 ప్రాథమిక వస్తువుల ధరను, ఛార్జీలను కచ్చితంగా అమలు చేసేందుకు వీలుగా వాటిని ఎలక్ట్రానిక్ సిస్టమ్‌లోకి అప్‌లోడ్ చేసినట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. వినియోగదారుల హక్కులను కాపాడేందుకు వీలుగా వస్తువుల ధరల స్థాయిలను పర్యవేక్షించడానికి ఈ పర్యటనల ముఖ్య ఉద్దేశం అని పేర్కొంది. వాణిజ్యపరమైన ఉల్లంఘనలను ఏకీకృత నంబర్ 1900 లేదా “బలాగ్ తిజారీ” (వాణిజ్య నివేదిక) యాప్ ద్వారా నివేదించాలని మంత్రిత్వ శాఖ వినియోగదారులకు పిలుపునిచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com