ప్రవాసుల డ్రైవింగ్ లైసెన్స్‌ ఫైల్స్ పునర్ పరిశీలన

- October 10, 2022 , by Maagulf
ప్రవాసుల డ్రైవింగ్ లైసెన్స్‌ ఫైల్స్ పునర్ పరిశీలన

కువైట్: గతంలో డ్రైవింగ్ లైసెన్సులు పొందిన ప్రవాసుల డ్రైవింగ్ లైసెన్సుల ఫైళ్లన్నింటినీ మళ్లీ పరిశీలించనున్నట్లు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇది ఉప ప్రధాని, రక్షణ మంత్రి అండ్ ఇంటీరియర్ తాత్కాలిక మంత్రి షేక్ తలాల్ అల్-ఖాలీద్ ఆదేశాలు, సూచనల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని పబ్లిక్ రిలేషన్స్ అండ్ సెక్యూరిటీ జనరల్ డిపార్ట్‌మెంట్ పేర్కొంది.
గతంలో నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా డ్రైవింగ్ లైసెన్స్ పొందినట్లు తేలితే వారికి సమన్లు ​​పంపిస్తామని, వారి లైసెన్స్ ను శాశ్వతంగా రద్దు చేయబడుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com