దర్శక ధీరుడు రాజమౌళి పుట్టినరోజు.!

- October 10, 2022 , by Maagulf
దర్శక ధీరుడు రాజమౌళి పుట్టినరోజు.!

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ దేశాల్లో చాటి చెప్పిన దర్శకుడు రాజమౌళి. అందుకే ఆయనను దర్శక ధీరుడు అని ముద్దుగా పిలుచుకుంటారు. రాజమౌళి సినిమాలో నటిస్తే చాలు, ఆ హీరోకి ప్యాన్ ఇండియా స్థాయి గుర్తింపు దక్కుతుందన్న నమ్మకం గట్టిగా ఏర్పడిపోయింది ఆయన ఇటీవల తెరకెక్కించిన సినిమాలతో.
ఆల్ టైమ్ రికార్డ్‌గా నిలిచింది రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ చిత్రం. ఇక, లేటెస్టుగా తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి ఏ స్థాయిలో గుర్తింపు దక్కిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆస్కార్ రేస్‌లో ఈ సినిమాని నిలిపేందుకు జక్కన్న చేసిన ప్లానింగ్స్ అన్నీ ఇన్నీ కావు.
మొత్తానికి రాజమౌళి కష్టం ఫలించింది. ఈ సినిమా ఆస్కార్ రేస్‌లోకి దూసుకెళ్లింది. ఇక, ఈ సినిమాతోనే రామ్ చరణ్, ఎన్టీయార్‌లు ప్యాన్ ఇండియా స్టార్స్‌గా గుర్తింపు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఒక్కసారైనా, ఒక్క సీన్‌లో అయినా సరే, రాజమౌళి సినిమాలో నటిస్తే చాలు జన్మ ధన్యమైపోతుంది.. అని నటీనటులు భావిస్తారంటేనే దర్శకుడిగా రాజమౌళికి వున్న గొప్పతనం ఏంటో అర్ధం చేసుకోవచ్చు. 
అలాంటి గొప్ప దర్శక ధీరుడు రాజమౌళి పుట్టినరోజు ఈ రోజు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో విషెస్ పోటెత్తుతున్నాయ్. ఇలాంటి బర్త్‌డేలు మరెన్నో జరుపుకోవాలంటూ, రికార్డు బ్రేకింగ్ సినిమాలెన్నో తెరకెక్కించాలనీ, మన తెలుగు సినిమాని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఆశిస్తూ, మనం కూడా ఆయనకు బర్త్‌డే విషెస్ చెప్పేద్దాం. హ్యాపీ బర్త్‌డే టు యూ రాజమౌళి.!

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com