దుబాయ్‌లో దీపావళి వేడుకలు: బంగారం, అపార్ట్‌మెంట్‌ను గెలుచుకోండి
- October 11, 2022
దుబాయ్: Covid-19 తర్వాత దుబాయ్ నివాసితులు వివిధ ప్రభుత్వ, కార్పొరేట్ సంస్థల భాగస్వామ్యంతో దీపావళిని భారీ స్థాయిలో జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. 10 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో ప్రత్యక్ష పలు సాంస్కృతిక కార్యక్రమాలు, బాణసంచా ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నారు. దీనితోపాటు ఈ వేడుకల్లో పాల్గొనే వారు ఒక సంవత్సరం పాటు అద్దె రహిత అపార్ట్‌మెంట్‌ను గెలుచుకునే అవకాశంతోపాటు 10 మంది విజేతలు 50 గ్రాముల బంగారాన్ని గెలుచుకునే అవకాశం ఉన్నది. ఈ మెగా వేడుక వివరాలను అల్ సీఫ్ హెరిటేజ్ ప్రాంతంలో భారత కాన్సుల్ జనరల్, దుబాయ్ ఎకానమీ అండ్ టూరిజం శాఖ అధికారులు వెల్లడించారు. ఫెస్టివల్ ప్లాజా, సిటీ సెంటర్ దీరా, బర్ జుమాన్ మాల్, ఒయాసిస్ మాల్, దుబాయ్ ఫెస్టివల్ సిటీ వంటి వివిధ షాపింగ్ మాల్స్, ఇతర ప్రదేశాలలో దీపావళి దుబాయ్ వేడుకల్లో భాగంగా అనేక రకాల కార్యక్రమాలు జరుగుతాయని రిటైల్ రిజిస్ట్రేషన్, దుబాయ్ ఫెస్టివల్స్ అండ్ రిటైల్ ఎస్టాబ్లిష్మెంట్ (DFRE) డైరెక్టర్ మహమ్మద్ ఫెరాస్ తెలిపారు. సాంకేతికత దీపావళి వంటి వేడుకలను ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతుందని దుబాయ్‌లోని భారత కాన్సుల్-జనరల్ డాక్టర్ అమన్ పూరి అన్నారు. స్టార్టప్ ఎకో సిస్టమ్‌లో భారతీయ కంపెనీలతో పెద్ద మొత్తంలో ట్రాక్షన్‌ను చూస్తున్నామని, వారిలో చాలా మంది ఈ దీపావళి పండుగకు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించనున్నారని పూరి తెలిపారు.


తాజా వార్తలు
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!







