గాయపడిన కార్పెంటర్ కు Dh350,000 పరిహారం
- October 12, 2022
యూఏఈ: ఎలక్ట్రిక్ రంపంతో పనిచేసే సమయంలో తీవ్రంగా గాయపడ్డ ఆసియాకు చెందిన ఓ కార్పెంటర్ కు Dh350,000 పరిహారం చెల్లించాలన్న అబుధాబి సివిల్ కోర్ట్ ఆఫ్ కాసేషన్ దిగువ కోర్టుల తీర్పును సమర్థించింది. ఆసియా కార్మికుడిని నియమించిన వడ్రంగి కంపెనీని బాధితుడికి పరిహారం చెల్లించమని ఆదేశించింది. కంపెనీ నిర్లక్ష్యం, భద్రతా నియమాలను ఉల్లంఘించడం స్పష్టంగా కనిపిస్తుందని కోర్టు తన తీర్పులో వెల్లడించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. విద్యుత్ రంపాన్ని ఉపయోగిస్తున్నప్పుడు ఏర్పడ్డ గాయాల కారణంగా తనకు శాశ్వత వైకల్యం ఏర్పడిందని, దీంతో పని చేయలేకపోవడం వల్ల మానసికంగా, భౌతికంగా నష్టపోయానని.. పరిహారంగా తనకు 2 మిలియన్ దిర్హామ్‌లు చెల్లించాలని డిమాండ్ చేస్తూ కార్మికుడు కంపెనీపై దావా వేశాడు. భద్రతా నిబంధనలను ఉల్లంఘించినందుకు నేరం రుజువైన తర్వాత క్రిమినల్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్ కంపెనీకి గతంలో 7,000 దిర్హామ్‌లు జరిమానా విధించింది. క్రిమినల్ కోర్టు న్యాయమూర్తి, నష్టపరిహారం కోసం తన యజమానిపై సివిల్ దావా వేయాలని కార్మికుడికి సూచించారు. అనంతరం సివిల్ కేసును విచారించిన కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ నష్టపరిహారంగా కార్మికుడికి Dh350,000 చెల్లించాలని కంపెనీని ఆదేశించిన సివిల్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్ తీర్పును సమర్థించింది. దాంతోపాటు కార్మికునికి చట్టపరమైన ఖర్చులను కూడా చెల్లించాలని తన తీర్పులో వెల్లడించింది.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







