భారతీయ విద్యార్థులకు శుభవార్త ..
- October 12, 2022
చైనా: రెండేళ్లుగా వీసాల కోసం ఎదురు చూస్తున్న భారతీయ విద్యార్థులకు శుభవార్త చెప్పింది చైనా. దాదాపు 1,300 మందికిపైగా భారతీయ విద్యార్థులకు వీసాలు మంజూరు చేసినట్లు చైనా విదేశాంగ శాఖ వెల్లడించింది. 2020లో కోవిడ్ ఎంతటి ప్రభావాన్ని చూపిందో తెలిసిందే.
ఆ సమయంలో చైనాలో చదువుకుంటున్న వేలాదిమంది భారతీయులు ఇండియా తిరిగొచ్చారు. చదువు మధ్యలోనే ఆపేసి, దేశానికి తిరిగొచ్చారు. ఆ సమయంలో అక్కడ అన్ని విద్యా సంస్థల్ని మూసేశారు. అయితే, గతంతో పోలిస్తే చైనాలో ప్రస్తుతం పరిస్థితులు కాస్త మెరుగ్గానే ఉన్నాయి. అలాగే విద్యాసంస్థలు ఎప్పట్లానే కొనసాగుతున్నాయి. దీంతో చైనా నుంచి తిరిగొచ్చిన విద్యార్థులు.. తిరిగి చైనా వెళ్లాలనుకుంటున్నారు. కానీ, చైనా రెండేళ్లుగా వీసాలు మంజూరు చేయడం లేదు. ముఖ్యంగా భారతీయ విద్యార్థుల్ని అనుమతించడంలేదు. కేంద్ర ప్రభుత్వం కూడా అనేకసార్లు ఈ విషయాన్ని చైనా దృష్టికి తీసుకెళ్లింది.
అయినా, చైనా నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. తాజాగా 1,300 మంది విద్యార్థులకు వీసాలు మంజూరు చేసింది. చైనాలో భారతీయులు ఎక్కువగా వైద్య విద్య చదువుకుంటారు. ప్రస్తుతం ఉన్న నివేదికల ప్రకారం.. దాదాపు 23,000 మంది భారతీయ విద్యార్థులు చైనా యూనివర్సిటీల్లో చదువుకుంటున్నారు. మిగతా వారికి వీసాలు ఎప్పుడు మంజూరు చేస్తారు అనే అంశంపై ఇంకా స్పష్టత లేదు.
తాజా వార్తలు
- కువైట్ ఇంటర్నెట్ మార్కెట్లో మొబైల్ రూటర్ల ఆధిపత్యం..!!
- కోస్ట్ గార్డ్ పెట్రోల్ తో ఫిషింగ్ బోట్ ఢీ..!!
- గాజాలో కాల్పుల విరమణ.. తదుపరి దశలపై కైరోలో చర్చలు..!!
- కొత్త మోసాల పై యూజర్లకు హెచ్చరిక
- ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు
- డాలస్ లో ప్రవాస భారతీయ అవగాహనా సదస్సు...
- 'పెడల్ ఫర్ పింక్' సైక్లథాన్ కార్యక్రమం నిర్వహణ
- దుబాయ్లో తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
- సామూహిక విధ్వంసక ఆయుధాలపై ఖతార్ ఆందోళన..!!







