పెట్టుబడుల పేరుతో చైనీస్ ఘరానా మోసం..
- October 12, 2022
హైదరాబాద్: చైనా సైబర్ క్రైమ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పెట్టుబడుల పేరుతో నిందితులు రూ.900 కోట్లు మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ డబ్బును హవాలా మార్గంలో చైనా తరలిస్తున్నట్లు నిర్ధారించారు. చైనా సైబర్ క్రైమ్ కి సంబంధించిన వివరాలను హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వివరించారు.
లాభాల ఆశతో ఈ ముఠా భారీ మోసానికి పాల్పడింది.ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో హవాలా రాకెట్ నడిపింది. ఏకంగా రూ. 900 కోట్ల ఫ్రాడ్‌కి పాల్పడింది.ఈ ముఠా గురించి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు అందగా వెంటనే రంగంలోకి దిగింది. తమదైన శైలిలో విచారణ చేపట్టి.. ఈ రూ.900 కోట్ల హవాలా స్కామ్‌ని బట్టబయలు చేసింది.
ఈ కేసులో మొత్తం 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో నలుగురు చైనా దేశస్తులు, ఐదుగురు ఢిల్లీ వాసులు, ముగ్గురు హైదరాబాద్‌కి చెందిన వాళ్లు ఉన్నారు. పెట్టుబడుల పేరుతో మొత్తం రూ. 900 కోట్లు వసూలు చేసిన ఈ ముఠా.. ఆ డబ్బుని విదేశాలకు తరలించేశారు. దేశవ్యాప్తంగా చాలామంది నుంచి వాళ్లు ఆ డబ్బుల్ని ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో దోచేసినట్టు పోలీసులు గుర్తించారు. అరెస్ట్ చేసిన 12 మందిని రిమాండ్‌కు తరలించిన అధికారులు, వారి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈడీ, ఐటీ, డీఆర్ఐ.. మరే దర్యాప్తు సంస్థలు చేపట్టని ఇన్వెస్టిగేషన్.. అలాంటి భారీ ఫ్రాడ్ కేస్‌ను హైదరాబాద్ పోలీసులు చేధించారు. ఆథరైజ్డ్ మనీ ఎక్ఛేంజర్స్ ద్వారా ఇండియన్ రుపీని డాలర్స్ లోకి మార్చి.. ఈ హవాలా మనీ విదేశాలకు పంపే భారీ మోసం గుట్టురట్టు చేశారు.
చైనీయులు రహస్యంగా మన దేశంలో చొరబడి ఇలాంటి ఫ్రాడ్ ఆపరేషన్స్ చేస్తున్నారని, ఇది హైదరాబాద్ సిటీ పోలీసులు సాధించిన రేర్ అచీవ్ మెంట్‌గా సీపీ ప్రశంసించారు. ఇది ఫెమా యాక్ట్ ఉల్లంఘనగా సీపీ ఆనంద్ చెప్పారు. ఈ కేసులో మహారాష్ట్రలోని పుణెకు చెందిన వీరేందర్ సింగ్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. చైనా దేశానికి చెందిన జాక్ హస్తం బయటపడిందని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. పెట్టుబడుల పేరుతో హవాలా రాకెట్ నడిపినట్లు ఆయన వెల్లడించారు.
తాజా వార్తలు
- ఏపీలో విద్యార్థులందరికీ గుడ్‌న్యూస్..
- గల్ఫ్‌లో ‘అఖండ 2’ ప్రీమియర్ షోలు రద్దు – NBK అభిమానుల్లో తీవ్ర నిరాశ
- స్ట్రీమింగ్ మార్కెట్లో నెట్‌ఫ్లిక్స్ ఆధిపత్యం
- డైమండ్ ఎగ్జామినేషన్ ప్రోగ్రామ్ ను ప్రారంభించిన ఖతార్..!!
- సౌదీలోని పలు ప్రాంతాలలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- ఇండిగో సంక్షోభం కంటిన్యూ..డొమెస్టిక్ సర్వీసెస్ క్యాన్సిల్..!!
- స్పెషల్ అట్రాక్షన్.. అల్-మసీలా బీచ్‌లో ఫియస్టా సిటీ..!!
- బహ్రెయిన్ ఫెస్టివల్‌ను ప్రారంభించిన షేక్ మొహమ్మద్..!!
- ‘అరబ్ గవర్నమెంట్ ఎక్సలెన్స్ అవార్డు’ అందుకున్న ఒమన్..!!
- ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు







