నర్సరీ పిల్లలపై దాడి చేసినందుకు మూడేళ్లు జైలుశిక్ష, బహిష్కరణ
- October 12, 2022
మనామా: ప్రత్యేక అవసరాలు గల పిల్లలపై దాడికి పాల్పడిన కేసులో దోషిగా తేలిన ఓ ప్రవాస మహిళకు మూడేళ్ల జైలు శిక్ష పడింది. దీంతోపాటు జైలుశిక్ష పూర్తయిన తర్వాత దేశం నుంచి భహిష్కరించాలని కోర్టు ఆదేశించింది. నర్సరీ ఉద్యోగి పిల్లవాడిని కొట్టిన వీడియోను మరొక ఉద్యోగి తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ అయింది. ఈ ఘటనపై పబ్లిక్ ప్రాసిక్యూషన్ దర్యాప్తు ప్రారంభించింది. దాడి ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజీని సమీక్షించింది. పిల్లలపై దాడికి పాల్పడ్డ ఉద్యోగులను అరెస్టు చేయాలని ఆదేశించింది. పర్మిట్ లేకుండా పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులకు BHD100 జరిమానా విధించారు. శిక్ష పూర్తయిన తర్వాత దేశం నుండి శాశ్వతంగా బహిష్కరించాలని ఆదేశించారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







