అనుపమ ఖాతాలో మరో క్రేజీ ప్రాజెక్ట్.!
- October 13, 2022
‘డీజె టిల్లు’ అంటూ కరోనా ప్యాండమిక్ టైమ్‌లో ధియేటర్లో సందడి చేసిన సినిమాకి యూత్ నుంచి అనూహ్యంగా క్రేజ్ దక్కింది.చిన్న సినిమాల్లో పెద్ద విజయాన్ని అందుకుంది ఈ సినిమా. సిద్దు జొన్నల గడ్డ, నేహాశెట్టి హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా సెన్సేషనల్ విజయం అందుకుంది.
ఈ సినిమాలోని కామెడీ కానీ, పాటలు కానీ ఓ ఊపు ఊపేశాయని చెప్పొచ్చు. దాంతో, ఈ సినిమాకి సీక్వెల్ రూపొందించాలని యూనిట్ భావించింది. ఆ ఊపు చల్లారకుండానే, సీక్వెల్ ప్లాన్ చేసేశారు ‘టిల్లు’ అండ్ టీమ్.
విమల్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సీక్వెల్ కోసం బడ్జెట్ లెక్కలు కూడా పెంచేశారు. అంతా బాగానే వుంది. కానీ, సీక్వెల్‌ని మొదటి పార్ట్ నటీనటులతోనే తెరకెక్కిస్తారా.? అంటే, హీరోయిన్‌ని మార్చేయాలని డిసైడ్ అయ్యారట. నిప్పు లేనిదే పొగ రాదు కదా.. ఆ నోటా ఈ నోటా ఆ గాసిప్ బయటికి వచ్చేసింది.
దాంతో సెకండ్ పార్ట్‌లో హీరోయిన్ రాధిక పాత్రలో కనిపించే ఆ హీరోయిన్ ఎవరంటూ ఆరా మొదలయ్యింది. లేటెస్టుగా సిద్దు జొన్నలగడ్డ సోషల్ మీడియా అకౌంట్ నుంచి ఆ ఆరాకి సమాధానం దొరికినట్లైంది. టిల్లుగాడితో అనుపమ పరమేశ్వరన్ జత కట్టబోతోందని చిన్న ఉప్పందింది.
తన అకౌంట్‌లో అనుపమ పరమేశ్వరన్ ఫోటోని షేర్ చేయడమే ఆ ఉప్పు. ‘టిల్లుగాడితో అట్లుంటది..’ అని రాసి వున్న టీషర్ట్‌ని ధరించిన అనుపమ ఫోటోని పోస్ట్ చేసి, ‘యు ఆర్ సో బ్యూటిఫుల్ అను’ అని పోస్ట్ పెట్టాడు సిద్దు జొన్నలగడ్డ. ఇక, అంతే, ఈ సినిమాలో హీరోయిన్ అనుపమ పరమేశ్వరనే అంటూ నెటిజన్లు ఫిక్సయిపోయారు. ఒకవేళ అదే జరిగితే, అనుపమ మరో క్రేజీ ప్రాజెక్ట్ పట్టేసినట్లే. రీసెంట్‌గా ‘కార్తికేయ 2’తో హిట్టు కొట్టిన అను, రెండో టిల్లుగానికి కూడా లక్కీ ఛామ్ అవుతుందేమో చూడాలి మరి.
తాజా వార్తలు
- ఏపీలో విద్యార్థులందరికీ గుడ్‌న్యూస్..
- గల్ఫ్‌లో ‘అఖండ 2’ ప్రీమియర్ షోలు రద్దు – NBK అభిమానుల్లో తీవ్ర నిరాశ
- స్ట్రీమింగ్ మార్కెట్లో నెట్‌ఫ్లిక్స్ ఆధిపత్యం
- డైమండ్ ఎగ్జామినేషన్ ప్రోగ్రామ్ ను ప్రారంభించిన ఖతార్..!!
- సౌదీలోని పలు ప్రాంతాలలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- ఇండిగో సంక్షోభం కంటిన్యూ..డొమెస్టిక్ సర్వీసెస్ క్యాన్సిల్..!!
- స్పెషల్ అట్రాక్షన్.. అల్-మసీలా బీచ్‌లో ఫియస్టా సిటీ..!!
- బహ్రెయిన్ ఫెస్టివల్‌ను ప్రారంభించిన షేక్ మొహమ్మద్..!!
- ‘అరబ్ గవర్నమెంట్ ఎక్సలెన్స్ అవార్డు’ అందుకున్న ఒమన్..!!
- ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు







