అఖిల్ ‘ఏజెంట్’ ఏమైనట్టబ్బా.!
- October 13, 2022
అక్కినేని అందగాడు అఖిల్ హీరోగా ‘ఏజెంట్’ అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఎప్పుడో ఈ సినిమాని పట్టాలెక్కించారు. షూటింగ్ కూడా జరుగుతూనే వుంది. కానీ, సినిమాకి సంబంధించిన ఏ అప్‌డేట్ లేదింతవరకూ.
అప్పుడెప్పుడో పోస్టర్, టీజర్ రిలీజ్ చేసి ఊరుకున్నారంతే. రిలీజ్ డేట్ విషయానికి వస్తే, ఇప్పటికే రెండు మూడు డేట్లు ఫిక్స్ చేశారు, పోస్ట్‌పోన్ చేశారు. గత ఏడాది డిశంబర్ 24న ‘ఏజెంట్’ రిలీజ్ కావల్సి వుంది. కుదరలేదు. ఈ ఏడాది ఆగస్టులో పక్కాగా వస్తుందన్నారు. రాలేదు. ఇక ముచ్చటగా మూడోసారి డిశంబర్ ముహూర్తం పెట్టారు. అది కూడా కుదిరేలా లేదన్నది తాజా సమాచారం.
దాంతో ఏకంగా సంక్రాంతి సీజన్‌కే తోసేశారు ‘ఏజెంట్’ని. ఈ ఏడాది సంక్రాంతికి ముగ్గురు పెద్ద హీరోలు బాక్సాఫీస్ వద్ద తలపడనున్నారు. మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేర్ వీరయ్య’గా రాబోతున్నారు. గోపీచంద్ మలినేని, బాలయ్య సినిమా కూడా సంక్రాంతి బరిలోనే స్లాట్ బుక్ చేసుకుంది.
ఇక, ప్యాన్ ఇండియా మూవీ ‘ఆది పురుష్’తో ప్రబాస్ సంక్రాంతికే రానున్నాడు. సో, ఒకవేళ సంక్రాంతికి అఖిల్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంటే, ఈ ముగ్గురు స్టార్ హీరోలతో ‘ఏజెంట్’ పోటీ పడాల్సి వుంటుంది. మరి, అంత రిస్క్ చేసే దమ్ముందా ‘ఏజెంట్’కి.! లెట్స్ వెయిట్ అండ్ సీ.!
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!
- ప్రైవేట్ రంగంలో విదేశీ కార్మికుల నియామకంపై నిషేధం..!!
- సిద్రా మెడిసిన్‌లో ‘హీలింగ్ నోట్స్’ ప్రారంభం..!!
- SR21 మిలియన్ల విలువైన 39వేల రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- సహామ్‌లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- Android 16 ఆధారిత కొత్త అప్‌డేట్ వివరాలు
- విలువైన బిట్‌కాయిన్ సీజ్ చేసిన అమెరికా
- ఆస్కార్ రేసులో సౌదీ 'హిజ్రా' సినిమా..!!
- ఒమన్ లో పర్యావరణ పరిరక్షణకు ప్రోత్సాహం..!!