దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్: $1 మిలియన్ గెలుచుకున్న ప్రవాసులు
- October 13, 2022
దుబాయ్: దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ కోసం జరిగిన తాజా డ్రాలో ఇద్దరు ప్రవాసులు ఒక్కొక్కరు $1 మిలియన్ చొప్పున గెలుచుకున్నారు. ఒమన్‌లో ఉన్న 58 ఏళ్ల భారతీయుడు రాజమోహన్ V K.. సెప్టెంబర్ 21న ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన టిక్కెట్‌తో గెలిచాడు. 2007 నుండి దుబాయ్ డ్యూటీ ఫ్రీ ప్రమోషన్‌లో రెగ్యులర్ పార్టిసిపెంట్. రాజమోహన్ ఇద్దరు పిల్లల తండ్రి. ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. అతనితో పాటు దుబాయ్‌లో ఉన్న 50 ఏళ్ల ఇరానియన్ ఎఫ్ సలామత్.. అతను సెప్టెంబర్ 28న ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన టిక్కెట్‌తో గెలిచాడు. ఇతను 25 సంవత్సరాలుగా దుబాయ్ డ్యూటీ ఫ్రీ ప్రమోషన్‌లో రెగ్యులర్ పార్టిసిపెంట్. సలామత్ ఒక బిడ్డకు తండ్రి. కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ దుబాయ్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. మిలీనియం మిలియనీర్ ప్రదర్శన తర్వాత ఒక లగ్జరీ కారు, రెండు మోటార్‌బైక్‌ల కోసం ఫైనెస్ట్ సర్‌ప్రైజ్ డ్రా నిర్వహించారు. ఇందులో అబుధాబిలో నివాసముంటున్న 34 ఏళ్ల ఇరానియన్ మహ్మద్ షరీఫ్ మెర్సిడెస్ బెంజ్ ఎస్500 (అబ్సిడియన్ బ్లాక్ మెటాలిక్) కారును గెలుచుకున్నాడు. 12 సంవత్సరాలుగా అబుదాబిలో నివసిస్తున్న షరీఫ్ ఇద్దరు పిల్లల తండ్రి. మదీనాత్ జాయెద్ గోల్డ్ సెంటర్‌లో పనిచేస్తున్నారు. అతనితోపాటు అజ్మాన్‌లో ఉన్న 39 ఏళ్ల భారతీయుడు ముత్తు రాజన్ ఇండియన్ స్కౌట్ (బ్లాక్ మెటాలిక్) మోటార్‌బైక్‌ను గెలుచుకున్నాడు. ఇతను 3 సంవత్సరాలుగా దుబాయ్ డ్యూటీ ఫ్రీ ప్రమోషన్‌లో రెగ్యులర్ పార్టిసిపెంట్. రాజన్ ఇద్దరు పిల్లల తండ్రి. ఇంజనీరింగ్ కాలేజీలో ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు. వీళ్లతోపాటు అబుధాబిలో ఉన్న 32 ఏళ్ల చైనీస్ జియాన్ యాన్ BMW R నైన్‌టి స్క్రాంబ్లర్ (గ్రానైట్ గ్రే మెటాలిక్) మోటార్‌బైక్‌ను గెలుచుకున్నాడు. ADNOC లో ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. 2002లో ఈవెంట్ ప్రారంభమైనప్పటి నుండి ఫైనెస్ట్ సర్‌ప్రైజ్ మోటార్‌బైక్ ప్రమోషన్‌ను గెలుచుకున్న మొదటి చైనీస్ అని నిర్వాహకులు ప్రకటించారు.
తాజా వార్తలు
- ప్రయాణికులకు అలెర్ట్..దోహా మెట్రో లింక్ సర్వీస్ అప్డేట్..!!
- రియాద్‌లో జాయ్ ఫోరం 2025..SR4 బిలియన్ ఒప్పందాలు..!!
- ఫ్లైట్ లో లిథియం బ్యాటరీ పేలుడు..ప్రయాణికులు షాక్..!!
- ఒమన్ లో వైభవంగా దీపావళి వేడుకలు..!!
- బహ్రెయిన్ పోస్ట్ మొబైల్ పోస్టల్ సేవలు ప్రారంభం..!!
- కెపిటల్ గవర్నరేట్‌లో భద్రత, ట్రాఫిక్ క్యాంపెయిన్..!!
- దుబాయ్ లో దీపావళి సెలబ్రేషన్స్..Dh5లక్షల విలువైన బహుమతులు..!!
- ఆకర్షణీయమైన పెట్టుబడులకు గమ్యస్థానంగా ఒమన్..!!
- గ్లోబల్ మార్కెట్లో సత్తా చాటుతున్న భారత్
- కువైట్ లో వేగంగా మారుతున్న వాతావరణం..!!