ప్రవాస కార్మికులు లీగల్ స్టేటస్ ధృవీకరించుకోవాలి: ఎల్ఎంఆర్ఏ
- October 13, 2022
మనామా: బహ్రెయిన్ రాజ్యంలో ఉన్న ప్రవాస కార్మికులందరూ తమ హక్కులను కాపాడుకోవడానికి లీగల్ స్టేటస్ ని ధృవీకరించుకోవాలని లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) పిలుపునిచ్చింది. రెసిడెన్సీ చట్టాలతో సహా రాజ్యంలో వర్తించే అన్ని చట్టాలు, నిబంధనలను కార్మికులు పాటించాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా అథారిటీ గుర్తుచేసింది. కార్మికుడు రాజ్యంలోకి రాకముందే తమ యజమాని నుండి అధికారిక వర్క్ పర్మిట్‌ను పొందాలని సూచించింది. విజిట్ వీసాపై చట్టవిరుద్ధంగా ఉద్యోగంలో చేరితే.. అలాంటి వారికి భారీ జరిమానాలతోపాటు బహిష్కరణ వేటు వేస్తామని హెచ్చరించింది. ప్రవాస కార్మికులు మొదటిసారిగా రాజ్యంలోకి ప్రవేశించిన తర్వాత ఒక నెలలోగా బయోమెట్రిక్ డేటాను అథారిటీకి అందించడంతో పాటు, వర్క్ పర్మిట్‌కు సంబంధించిన అన్ని చట్టపరమైన విధానాలను పూర్తి చేయాల్సి ఉంటుందని LMRA స్పష్టం చేసింది. ఆరోగ్య బీమా ఖర్చులతో సహా కార్మికునిపై విధించిన అన్ని రుసుములను యజమాని భరించాలని చట్టం చెబుతుందని, వర్క్ పర్మిట్ జారీ లేదా పునరుద్ధరణకు బదులుగా యజమానికి ఏదైనా డబ్బు లేదా ప్రయోజనాలను అందించకుండా కార్మికుడిని నిషేధిస్తున్నట్లు తెలిపే నిబంధనలను అథారిటీ గుర్తు చేసింది. ప్రవాస వర్కర్ బదిలీ బదిలీ పూర్తయ్యే వరకు.. కొత్త యజమాని కింద కొత్త వర్క్ పర్మిట్ జారీ చేయబడే వరకు ప్రస్తుత యజమాని వద్ద పని చేయడం మానేయాలని కార్మికులకు LMRA సూచించింది. ఏమైనా సమస్యలు తలెత్తిన పక్షంలో కార్మికులు తమకు నిర్దేశించిన కేంద్రాలలో సంప్రదించాలని అథారిటీ సూచించింది. అనేక భాషల్లో 24 గంటలూ పని చేసే హాట్‌లైన్ 995లో ప్రవాస కార్మికుల రక్షణ, సహాయ కేంద్రాన్ని సంప్రదించాలని కోరింది.
తాజా వార్తలు
- సౌదీలో న్యూ రిక్రూట్ మెంట్ గైడ్.. SR20,000 ఫైన్, 3 ఏళ్ల నిషేధం..!!
- బహ్రెయిన్‌లో డైరెక్టర్ అజిత్ నాయర్ బుక్ రిలీజ్..!!
- కువైట్ లో లైసెన్స్ లేని ప్రకటనలకు KD 5,000 ఫైన్..!!
- అల్ ఖాన్ బ్రిడ్జి సమీపంలో అగ్నిప్రమాదం..!!
- ఒమన్‌లో గరిష్ఠానికి చేరిన పబ్లిక్ కంప్లయింట్స్..!!
- ఖతార్ లో అక్టోబర్ 26 నుండి చిల్డ్రన్స్ స్పోర్ట్స్ క్యాంప్..!!
- చెస్ గ్రాండ్‌మాస్టర్ డానియల్ నారోడిట్స్కీ కన్నుమూత
- అమరుల త్యాగాలు వెలకట్టలేనివి: సిపి సుధీర్ బాబు
- క్రోమ్, ఫైర్ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక
- ఏపీ వ్యవసాయానికి ఆస్ట్రేలియా సపోర్ట్