రియాద్‌లో ట్రాఫిక్ ఉల్లంఘనలపై హైటెక్ పర్యవేక్షణ
- October 14, 2022
రియాద్: ట్రాఫిక్ ఉల్లంఘనలు, ఇతర నేరాలపై హైటెక్ పర్యవేక్షణను అమలు చేయడం ప్రారంభించినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. పథకం మొదటి దశ రియాద్ ప్రాంతంలో ప్రారంభించినట్లు తెలిపింది. ట్రాఫిక్, నేర ఉల్లంఘనలను పర్యవేక్షించేందుకు అధిక-ఖచ్చితమైన సాంకేతిక వ్యవస్థలను ఏర్పాటు చేసినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. పెట్రోలింగ్ బృందాలు రాడార్, 360-డిగ్రీ కెమెరాతో సహా అత్యంత అధునాతన సాంకేతిక పరికరాలను కలిగి ఉంటాయన్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనలను పూర్తి స్థాయిలో పర్యవేక్షించడం, డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్‌లను ఉపయోగించడం, సీట్ బెల్ట్ ధరించకపోవడం వంటి వాటిని సులువుగా పసిగట్టే అవకాశం ఉందన్నారు. రియాద్ ప్రాంతంలో ప్రారంభ దశలో.. హైటెక్ పరికరాలను ఉపయోగించడం ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనలను పర్యవేక్షించే రెండు భద్రతా గస్తీలు తమ పనులను ప్రారంభించాయన్నారు. వాంటెడ్ లిస్ట్‌లో లేని వాహనాల్లో ప్రయాణిస్తున్నప్పటికీ వాంటెడ్ పర్సన్స్‌ను సెక్యూరిటీ అధికారులు పట్టుకునేలా ఈ వ్యవస్థను రూపొందించినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- భారత పర్యటనకు రానున్న బ్రిటన్ ప్రధాని..
- మూడు ప్రాంతాలు.. మూడు సభలు..కూటమి బిగ్ ప్లాన్..!
- మలేషియాలో ఘనంగా దసరా, బతుకమ్మ, దీపావళి వేడుకలు
- హమాస్ ప్రకటనను స్వాగతించిన ఖతార్..!!
- సౌదీ అరేబియా, ఫ్రాన్స్ తొలి సాంస్కృతిక సంస్థ ప్రారంభం..!!
- ప్రపంచ వేదికపై మొదటి ఎమిరాటీగా మరియం రికార్డు..!!
- మానవ అక్రమ రవాణా, వీసా స్కామ్ గుట్టురట్టు..!!
- ఒమన్ లో 50శాతం పెరిగిన సైబర్ నేరాలు..!!
- ఇజ్రాయెల్ నిర్బంధంపై ఒక్కటైన బహ్రెయిన్, కువైట్..!!
- టీమ్ఇండియా వన్డే కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్..