మాస్కో-ఢిల్లీ విమానానికి బాంబు బెదిరింపు కాల్
- October 14, 2022
న్యూ ఢిల్లీ: మాస్కో నుంచి ఢిల్లీకి వస్తున్న విమానానికి శుక్రవారం తెల్లవారుజామున బాంబు బెదిరింపు ఫోన్ కాల్ రావడం అందర్నీ భయబ్రాంతులకు గురి చేసింది. మాస్కో నుంచి ఢిల్లీ బయల్దేరిన విమానంలో బాంబు ఉందంటూ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి గురువారం అర్ధరాత్రి ఇ-మెయిల్ వచ్చింది. ఈ విమానం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో శుక్రవారం తెల్లవారుజామున 3.20 గంటల ప్రాంతంలో ల్యాండ్ అయ్యింది.
అప్పటికే భద్రతను కట్టుదిట్టం చేసి, విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో విమానంలో సిబ్బంది సహా 400 మంది ప్రయాణికులు ఉన్నారు. అనుమానాస్పద వస్తువులేమీ కన్పించలేదని అధికారులు తెలిపారు. ప్రస్తుతం విమానాన్ని ఐసోలేషన్‌లో ఉంచామని అన్నారు. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు విచారణకు ఆదేశించారు.
తాజా వార్తలు
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!







