ఏపీలోకి చేరిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర
- October 14, 2022
ఏపీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు తలపెట్టిన భారత్ జోడో యాత్ర ఏపీలో ప్రవేశించింది. రాహుల్ పాదయాత్ర నేడు కర్ణాటకలోని చిత్రదుర్గ నుంచి ప్రారంభమై అనంతపురం జిల్లా డి.హీరేహాళ్ సరిహద్దుకు చేరుకుంది. రాహుల్ గాంధీకి ఏపీ పీసీసీ చీఫ్ సాకే శైలజానాథ్, పార్టీ సీనియర్ నేత రఘువీరారెడ్డి తదితర నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. ఈ భారత్ జోడో యాత్ర కాసేపట్లో డి.హీరేహాళ్ చేరుకోనుంది. రాహుల్ గాంధీ డి.హీరేహాళ్ లోని మారెమ్మ గుడి వద్ద విశ్రాంతి తీసుకోనున్నారు. రాహుల్ ఈ సాయంత్రం ఓబుళాపురం మీదుగా బళ్లారి బయల్దేరతారు.
తాజా వార్తలు
- భారత పర్యటనకు రానున్న బ్రిటన్ ప్రధాని..
- మూడు ప్రాంతాలు.. మూడు సభలు..కూటమి బిగ్ ప్లాన్..!
- మలేషియాలో ఘనంగా దసరా, బతుకమ్మ, దీపావళి వేడుకలు
- హమాస్ ప్రకటనను స్వాగతించిన ఖతార్..!!
- సౌదీ అరేబియా, ఫ్రాన్స్ తొలి సాంస్కృతిక సంస్థ ప్రారంభం..!!
- ప్రపంచ వేదికపై మొదటి ఎమిరాటీగా మరియం రికార్డు..!!
- మానవ అక్రమ రవాణా, వీసా స్కామ్ గుట్టురట్టు..!!
- ఒమన్ లో 50శాతం పెరిగిన సైబర్ నేరాలు..!!
- ఇజ్రాయెల్ నిర్బంధంపై ఒక్కటైన బహ్రెయిన్, కువైట్..!!
- టీమ్ఇండియా వన్డే కెప్టెన్గా శుభ్మన్ గిల్..