ప్రపంచ రోబోట్ ఒలింపియాడ్ క్వాలిఫైయర్స్: ప్రతిభచాటిన 200 మంది సౌదీ విద్యార్థులు
- October 15, 2022
రియాద్: 2022 ప్రపంచ రోబో ఒలింపియాడ్ ఫైనల్ క్వాలిఫయర్స్‌లో 200 మందికి పైగా విద్యార్థులు, 90 మంది ట్రైనర్స్ పాల్గొన్నారని సౌదీ విద్యాశాఖ ప్రకటించింది. రియాద్‌లోని కింగ్ సల్మాన్ సైన్స్ ఒయాసిస్‌లో సౌదీ వైర్‌లెస్ స్పోర్ట్స్ అండ్ రిమోట్ కంట్రోల్ స్పోర్ట్స్ ఫెడరేషన్, రోబోట్ అక్టోబరు 11-13 వరకు మూడు రోజుల ఫైనల్ క్వాలిఫైయర్‌లను నిర్వహించాయి. "మై రోబోట్, మై ఫ్రెండ్" అనే థీమ్‌తో 9-19 సంవత్సరాల మధ్య వయస్సున్న పిల్లలు తమ సృజనాత్మకత, సమస్య పరిష్కార నైపుణ్యాలను ప్రదర్శించారు. ఫ్యూచర్ ఇంజనీర్ విభాగంలో పాల్గొన్నవారు ఇంజనీరింగ్ డిజైన్, ప్రోగ్రామింగ్ నైపుణ్యాలు, కృత్రిమ మేధస్సును కలిపి సెల్ఫ్ డ్రైవింగ్ కార్ మోడల్‌ను రూపొందించారు. వర్చువల్ రోబోట్ ఛాలెంజ్ రోబోట్ ప్రోగ్రామింగ్ ద్వారా విద్యార్థుల సాంకేతిక నైపుణ్యాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనే విద్యార్థులు సౌదీకి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఇది నవంబర్‌లో జర్మనీలో జరుగనుంది. ఇందులో 90 కంటే ఎక్కువ దేశాల నుండి విద్యార్థలు పాల్గొంటారని సౌదీ విద్యాశాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- రూ.100 నాణెం విడుదల చేసిన ప్రధాని మోదీ..
- ఏపీకి నాలుగు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు..
- అక్టోబర్ 2025లో 20 రోజుల బ్యాంక్ సెలవులు
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- దుబాయ్ లో IPF (తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్) ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ పండగ వేడుకలు
- ఆయుధాలకు లైసెన్స్.. డెడ్ లైన్ విధించిన ఖతార్..!!
- రియాద్ లో హెల్త్ ప్రాక్టిస్.. డాక్టర్ అరెస్టు..!!
- విజిటర్స్ ను ఆకర్షిస్తున్న యూఏఈ న్యూ సాలరీ కండిషన్..!!
- కార్డ్ చెల్లింపులపై అదనపు ఫీ వసూలు చేయొద్దు..!!
- బహ్రెయిన్,అమెరికా మధ్య గల్ఫ్ ఎయిర్ డైరెక్ట్ ఫ్లైట్స్ ప్రారంభం..!!