హవల్లీ, ముబారక్ అల్-కబీర్‌లలో ప్రారంభమైన ప్రవాసుల లైసెన్స్‌ల తనిఖీలు
- October 15, 2022
కువైట్: హవల్లీ, ముబారక్ అల్-కబీర్‌లలో ప్రవాసుల లైసెన్స్‌ల తనిఖీలు ప్రారంభమైనట్లు కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉప ప్రధానమంత్రి, రక్షణ మంత్రి , అంతర్గత వ్యవహారాల తాత్కాలిక మంత్రి షేక్ తలాల్ అల్-ఖాలీద్ ఆదేశాల మేరకు కువైట్ వ్యాప్తంగా ప్రవాసుల డ్రైవింగ్ లైసెన్సులను తిరిగి పరిశీలించనున్నట్లు వెల్లడించింది. తనిఖీల్లో భాగంగా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్దేశించిన నిబంధనలను ఉల్లంఘించి డ్రైవింగ్ లైసెన్స్ పొందిన లైసెన్స్ హోల్డర్‌కు సమన్లు పంపబడతాయని, వారి లైసెన్స్ ను శాశ్వతంగా రద్దు చేయబడుతుందని అంతర్గత మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే అధికారికంగా ప్రవాసుల డ్రైవింగ్ లైసెన్సుల ఆడిట్ ప్రారంభమైందని క్రమంగా దేశంలోని వివిధ గవర్నరేట్‌లలోని అన్ని ట్రాఫిక్ విభాగాలలో సంబంధిత పత్రాలను పరిశీలన చేపట్టనున్నట్లు వెల్లడించింది. నిబంధనలు ఉల్లంఘించి డ్రైవింగ్ లైసెన్స్ పొందినట్టు తేలిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతోపాటు వారిని దేశం నుంచి బహిష్కరించనున్నట్లు మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- రూ.100 నాణెం విడుదల చేసిన ప్రధాని మోదీ..
- ఏపీకి నాలుగు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు..
- అక్టోబర్ 2025లో 20 రోజుల బ్యాంక్ సెలవులు
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- దుబాయ్ లో IPF (తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్) ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ పండగ వేడుకలు
- ఆయుధాలకు లైసెన్స్.. డెడ్ లైన్ విధించిన ఖతార్..!!
- రియాద్ లో హెల్త్ ప్రాక్టిస్.. డాక్టర్ అరెస్టు..!!
- విజిటర్స్ ను ఆకర్షిస్తున్న యూఏఈ న్యూ సాలరీ కండిషన్..!!
- కార్డ్ చెల్లింపులపై అదనపు ఫీ వసూలు చేయొద్దు..!!
- బహ్రెయిన్,అమెరికా మధ్య గల్ఫ్ ఎయిర్ డైరెక్ట్ ఫ్లైట్స్ ప్రారంభం..!!