తెలుగు సినీ దర్శకులు కె.రాఘవేంద్రరావు, అశ్వనీదత్ లు బాపూజీ కి ఘన నివాళి
- October 15, 2022
అమెరికా: శతాధిక చిత్రాల దర్శకుడు, రచయిత, నిర్మాత, 50 ఏళ్ళకి పైగా చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సుస్థిరం చేసుకున్న దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, వైజయంతీ మూవీస్ సినీనిర్మాణ సంస్థతో ఎన్నో ప్రతిష్టాత్మక చిత్రాలు నిర్మించి, తిరుగులేని నిర్మాతగా పేరుగాంచిన సినీ నిర్మాత చలసాని అశ్వినీదత్, పారిశ్రామిక వేత్త, కాకినాడ సీపోర్ట్ ఛైర్మన్ కె. వి. రావు శుక్రవారం డాలస్ లో నెలకొనిఉన్న అమెరికాదేశం లోనే అతి పెద్దదైన “మహాత్మాగాంధీ స్మారకస్థలిని” దర్శించి బాపూజీకి ఘనంగా పుష్పాంజలి ఘటించారు.
మన ప్రవాసాంధ్రులు భారతదేశ పేరు ప్రతిష్టలను పరదేశంలో ఉన్నత స్థాయిలో నిలబెడుతున్నారు అని చెప్పడానికి ఈ మహాత్మాగాంధీ స్మారకం ఒక ఉదాహరణ అని, ఇంతటి ఘనతను సాధించిన మహాత్మాగాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర, కార్యదర్శి రావు కల్వాల. బోర్డు సభ్యులు మురళీ వెన్నం తదితర కార్యవర్గ సభ్యులులను, జీవం ఉట్టిపడేటట్లు శిల్పాన్ని రూపొందించిన శిల్పి బుర్రా వరప్రసాద్ ను, సహకరించిన ఇర్వింగ్ పట్టణ ప్రభుత్వ అధికారులను వీరు ముగ్గురూ అభినందించారు.
ఎన్నో కార్యక్రమాలతో సతమవుతూ కూడా తీరిక చేసుకుని ఈ మహాత్మాగాంధీ స్మారకస్థలిని సందర్శించడానికి వచ్చినందులకు కె. రాఘవేంద్రరావు, అశ్వినీదత్, కె. వి. రావు కు డా. ప్రసాద్ తోటకూర తమ సంస్థ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసి అందరికీ గాంధీజీ జ్ఞాపికలను బహుకరించారు.
తానా పూర్వాధ్యక్షులు సతీష్ వేమన, సురభి రేడియో అధినేత్రి రాజేశ్వరి ఉదయగిరి, లోకేష్ నాయుడు, సతీష్ కొమ్మన, చినసత్యం వీర్నపు, సుదీర్ చింతమనేని, సుధాకర్ ప్రబృతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.



తాజా వార్తలు
- సమాజ సేవలో 'అర్జాస్ స్టీల్' ముందంజ
- IPL 2026: CSK పై RR విజయం
- యాపిల్స్ తో మోసం..హైదరాబాద్ వ్యాపారికి రూ.5.7 కోట్లు టోపీ !!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ తో ముగిసిన ఖతార్ ఎమిర్ భేటీ
- దుబాయ్ వ్యాపార రంగానికి AED 1 బిలియన్ సపోర్ట్ ప్యాకేజ్
- ఏనుగుకు గులాబీ రంగు..ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు
- ఏప్రిల్ లో బ్యాంకులకు 14 రోజులు సెలవులు..
- తెలంగాణ: అసెంబ్లీలో హేట్ స్పీచ్ బిల్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం
- నేవీ చీఫ్ మృతిని కన్ఫర్మ్ చేసిన ఇరాన్
- నాయుడుపేటలో టిడ్కో ఇళ్లను పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు









