అక్టోబర్ 30 నుంచి రోజు బెంగళూరు-దుబాయ్ మధ్య ఎమిరేట్స్ ఫ్లైట్ సేవలు
- October 15, 2022
యూఏఈ : యూఏఈ విమానయ సంస్థ ఎమిరేట్స్...ఇండియా నుంచి దుబాయ్ వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రత్యేకంగా బెంగళూరు టూ దుబాయ్ కి స్పెషల్ ఫ్లైట్ సేవలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ 30 నుంచి ప్రతి రోజు బెంగళూరు నుంచి దుబాయ్ కి ఎమిరేట్స్ A380 సర్వీసు ఫ్లైట్ నడపనుంది. ఇందుకు సంబంధించి ట్రయల్ రన్ గా ఫస్ట్ ఫ్లైట్ ను శనివారం ప్రారంభించింది. అక్టోబర్ 30 నుంచి దుబాయ్ -బెంగళూరు మధ్య ఎమిరేట్స్ A380 ఫ్లైట్ నంబర్ EK568, EK569గా నడుస్తాయి. దుబాయ్ నుంచి రాత్రి 9.25 గంటలకు ఎయిర్‌లైన్ హబ్ నుండి బయలుదేరి, మరుసటి రోజు తెల్లవారుజామున 2.30 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఉదయం 4.30 గంటలకు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరి, ఉదయం 7.10 గంటలకు దుబాయ్ చేరుకుంటుంది. సౌత్ ఇండియాలో ఫ్లైట్ సర్వీసు ప్రారంభించటం సంతోషంగా ఉందని ఎమిరేట్స్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ అద్నాన్ కాజిమ్ అన్నారు.
తాజా వార్తలు
- రూ.100 నాణెం విడుదల చేసిన ప్రధాని మోదీ..
- ఏపీకి నాలుగు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు..
- అక్టోబర్ 2025లో 20 రోజుల బ్యాంక్ సెలవులు
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- దుబాయ్ లో IPF (తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్) ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ పండగ వేడుకలు
- ఆయుధాలకు లైసెన్స్.. డెడ్ లైన్ విధించిన ఖతార్..!!
- రియాద్ లో హెల్త్ ప్రాక్టిస్.. డాక్టర్ అరెస్టు..!!
- విజిటర్స్ ను ఆకర్షిస్తున్న యూఏఈ న్యూ సాలరీ కండిషన్..!!
- కార్డ్ చెల్లింపులపై అదనపు ఫీ వసూలు చేయొద్దు..!!
- బహ్రెయిన్,అమెరికా మధ్య గల్ఫ్ ఎయిర్ డైరెక్ట్ ఫ్లైట్స్ ప్రారంభం..!!