చిమ్మ చీకట్లోనే పవన్ కళ్యాణ్ ర్యాలీ
- October 15, 2022
విశాఖపట్నం: జనవాణి కార్యక్రమంలో పాల్గొనేందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విశాఖకు వచ్చారు. ఎయిర్ పోర్ట్ లో తమ అధినేతకు అభిమానులు , కార్య కర్తలు ఘన స్వాగతం పలికారు. ఎయిర్ పోర్ట్ నుండి ర్యాలీగా బయలుదేరిన పవన్ కళ్యాణ్ కు షాక్ తగిలింది. ర్యాలీ గా వస్తున్న దారిలో స్ట్రీట్ లైట్లు వెలుగలేదు. చీకట్లోనే పవన్ తన ర్యాలీ ని కొనసాగించారు. చాల దూరం ఆలా చీకట్లోనే వచ్చారు. ఆ తర్వాత స్ట్రీట్ లైట్లు వెలిగాయి. పవన్ చీకట్లో వస్తూనే అభిమానులు తమ ఫోన్ లైట్ తో దారి ఇచ్చారు.
అంతకు ముందు ఎయిర్ పోర్ట్ లో వైస్సార్సీపీ నేతలకు జనసేన కార్య కర్తలు షాక్ ఇచ్చారు. అధికార వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖ లో వైస్సార్సీపీ విశాఖ గర్జన కు మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ గర్జన కు వైస్సార్సీపీ నేతలు , కార్య కర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మంత్రులు , నేతలు తిరిగి వెళుతున్న సమయంలో వారి కార్లపై జనసేన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో సుబ్బారెడ్డితో పాటు మంత్రుల కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. మంత్రులు జోగి రమేశ్, రోజా కార్ల అద్దాలను జనసైనికులు ధ్వంసం చేశారు. కార్లపై పిడిగుద్దులతో జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఊహించని అటాక్‌తో మంత్రులు, నేతలు షాక్ కు గురయ్యారు. రోజా కారుపై జనసేన మహిళా కార్యకర్తలు చెప్పులు, చీపుర్లను విసిరారు.
తాజా వార్తలు
- ఆయుధాలకు లైసెన్స్.. డెడ్ లైన్ విధించిన ఖతార్..!!
- రియాద్ లో హెల్త్ ప్రాక్టిస్.. డాక్టర్ అరెస్టు..!!
- విజిటర్స్ ను ఆకర్షిస్తున్న యూఏఈ న్యూ సాలరీ కండిషన్..!!
- కార్డ్ చెల్లింపులపై అదనపు ఫీ వసూలు చేయొద్దు..!!
- బహ్రెయిన్,అమెరికా మధ్య గల్ఫ్ ఎయిర్ డైరెక్ట్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- ఇబ్రిలో పొల్యుషన్ ఎమర్జెన్సీపై పర్యావరణ అథారిటీ క్లారిటీ..!!
- తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డి బాధ్యతలు స్వీకారం
- FIFA అరబ్ కప్ ఖతార్ 2025 టికెట్ల అమ్మకాలు ప్రారంభం..!!
- విదేశీ ప్రయాణికులు భారత్ కొత్త కండిషన్..!!
- బహ్రెయిన్‌లో షరోదుత్సోబ్ ప్రారంభం..!!