మలేషియాలో తెలుగు అకాడమీని సందర్శించిన వెంకయ్య నాయుడు
- October 15, 2022
కౌలలంపూర్: మలేసియా తెలుగు సంఘం వారు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన రావంగ్ లోని మలేషియా తెలుగు అకాడమీని సందర్శించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.ఈ విభాగం ద్వారా వారు తెలుగు భాష సంస్కృతి, లలితకళలకు సంబంధించిన విద్యాబోధన చేయడమే గాక, ఆగ్నేయాసియాలో తెలుగు కేంద్రంగానూ పని చేస్తుండటం అభినందనీయం అన్నారు.
మలేషియా తెలుగు అకాడమీ 4 స్థాయిల్లో అందించే డిప్లమా కోర్సులను రూపొందించడానికి హైదరాబాద్ లోని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సహకారం అందించటం ఆనందదాయకం అన్నారు.ఇక్కడి కుటుంబాల పిల్లలకు తెలుగు భాషను బోధించడానికి, వారిని తెలుగు సంస్కృతికి వారసులుగా తీర్చిదిద్దడానికి ఈ సంస్థ చేస్తున్న కృషి ముదావహం.
అకాడమీ భవనం సైతం తెలుగు సంస్కృతిని ప్రతిబింబిస్తోందన్నారు. త్రిలింగ దేశాన్ని సూచించే విధంగా మూడు విభాగాలను ఏర్పాటు చేయడం, అందులో ఐదు అంతస్తులను పంచభూతాలకు, 12 పిరమిడ్స్ ను దాతల నక్షత్రాలకు చిహ్నంగా ఏర్పాటు చేయడం చక్కని ఆలోచన. ఇది అకాడమీ కాదు... మలేషియా తెలుగు భాషా మందిరం.
తాజా వార్తలు
- FIFA అరబ్ కప్ ఖతార్ 2025 టికెట్ల అమ్మకాలు ప్రారంభం..!!
- విదేశీ ప్రయాణికులు భారత్ కొత్త కండిషన్..!!
- బహ్రెయిన్‌లో షరోదుత్సోబ్ ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో 3.2శాతానికి చేరుకున్న నిరుద్యోగ రేటు..!!
- కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం సామర్థ్యం పెంపు..!!
- క్రిప్టోకరెన్సీ మైనింగ్‌ను నిషేధించిన అబుదాబి..!!
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఈ-అరైవల్ కార్డ్ సిస్టమ్
- కరూర్ తొక్కిసలాట ఘటన..స్టాలిన్ ప్రభుత్వం సంచలన వీడియో..
- కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ
- తొక్కిసలాట పై స్పందించిన విజయ్