హీరోయిన్లు అంటే అందుకేనా.! నిధి అగర్వాల్ సంచలన వ్యాఖ్యలు.!
- October 15, 2022
‘సవ్య సాచి’, ‘మిస్టర్ మజ్ను’ సినిమాలతో హీరోయిన్గా టాలీవుడ్‌కి పరిచయమైన ముద్దుగుమ్మ నిధి అగర్వాల్. పేరులో వున్న నిధి ఆమె అందంలోనూ వుందంటే అతిశయోక్తి కాదేమో. అందాల నిధి అంతే నిధి అగర్వాల్.
అయితే, ఆ అందం అడవి కాచిన వెన్నెలగానే మిగిలిపోతోంది. ఎందుకో తెలీదు నిధి అగర్వాల్‌ని ఆశించిన మేర మేకర్లు పట్టించుకోవడం లేదు. అరకొరా అవకాశాలతోనే సరిపెడుతున్నారు. ఎలాగోలా ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ‘హరి హర వీరమల్లు’ సినిమాలో నిధి అగర్వాల్ ఛాన్స్ దక్కించుకుంది. కానీ, అది సరిపోదు ఆమె అందానికి.
ఆ సంగతి అలా వుంటే, తాజాగా ఓ ఇంటర్వ్యూలో నిధి అగర్వాల్ మాట్లాడిన మాటలు పెను సంచలనానికి కారణమవుతున్నాయ్. టాలీవుడ్లో హీరోయిన్లను కేవలం గ్లామర్ బొమ్మల్లాగే చూస్తారు. ఇక్కడ టాలెంట్ మాత్రమే వుంటే సరిపోదు. గ్లామర్ కూడా పుష్కలంగా వుండాలి.. అని చెప్పింది.
అంతేకాదు, అందుకే నేను అందాల ఆరబోతలో ఎలాంటి హద్దులు పెట్టుకోలేదని కుండ బద్దలు కొట్టేసిందీ ముద్దుగుమ్మ. అలాగే, రెమ్యునరేషన్ విషయంలోనూ తన నుంచి ఎలాంటి డిమాండ్లూ లేవనీ, ఎంత ఇస్తే అంత తీసుకుంటానని క్లారిటీ ఇచ్చింది నిధి అగర్వాల్.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







