ఎన్టీయార్ - కొరటాల ప్రాజెక్ట్.! ఇక భరించడం కష్టమే. అసహనం వ్యక్తం చేస్తున్న ఎన్టీయార్.!

- October 15, 2022 , by Maagulf
ఎన్టీయార్ - కొరటాల ప్రాజెక్ట్.! ఇక భరించడం కష్టమే. అసహనం వ్యక్తం చేస్తున్న ఎన్టీయార్.!

ఎన్టీయార్ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళుతుందా.? అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ ఎదురు చూపులు ఫలించేది ఎప్పుడో తెలియ రావడం లేదు. ఇదిగో అదిగో అంటున్నాడే తప్ప కొరటాల ఈ ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించలేకపోతున్నాడు.
కారణాలేమనేది తెలియ రావడం లేదు కానీ, ఫ్యాన్స్ నుంచి తీవ్ర స్థాయిలో ఒత్తిడి ఎక్కువైపోతోంది ఎన్టీయార్‌కి. ఇంతవరకూ ఫ్యాన్స్ నుంచే ఒత్తిడి భరించిన ఎన్టీయార్, ఇక తాను కూడా అసహనం వ్యక్తం చేస్తున్నాడట. 
ఈ నేపథ్యంలోనే ఎన్టీయార్ రూటు మార్చేస్తాడా.? అనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయ్. ఫ్యాన్స్ నుంచి కూడా ఆ తరహా సూచనలే వస్తున్నాయని తెలుస్తోంది. కొరటాల సినిమా తర్వాత ఎన్టీయార్, ప్రశాంత్ నీల్‌తో ఓ సినిమా చేయాల్సి వుంది. అయితే, ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రబాస్‌తో ‘సలార్’ సినిమా చేస్తున్నాడు. సో, ఆయన ఖాళీ లేడు.
ఈ లోపు ఓ కొత్త ఆలోచన వచ్చిందట ఎన్టీయార్‌కి. సూపర్ స్టార్ మహేష్‌బాబుతో ‘సర్కారు వారి పాట’ వంటి హిట్ కొట్టిన డైరెక్టర్ పరశురామ్‌తో ఓ సినిమా చేసేస్తే ఎలా వుంటుంది.? అనే ఐడియా వచ్చిందట. 
పరశురామ్ సినిమా అంటే మినిమమ్ బడ్జెట్‌లో, తక్కువ టైమ్‌లో పూర్తియిపోతుంది. పైగా హిట్ ఇచ్చిన డైరెక్టర్ కూడా. సో, ఎన్టీయార్ చేస్తున్న ఆలోచన మంచిదే అని అభిమానుల నుంచీ గ్రీన్ సిగ్నల్ వస్తుందన్న సమాచారం అందుతోంది. సో, ఈ ఆలోచన ఇంప్లిమెంట్ చేస్తే ఎన్టీయార్ సక్సెస్ అయినట్లే అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కానీ, ‘
ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీయార్ ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. సో, ఆయన నుంచి వచ్చే సినిమాలన్నీ ఆ స్థాయిలోనే వుండాలి. మరి, పరశురామ్ ఆ రేంజ్‌ని అందుకోగలడా.?

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com