త్వరలోనే ఇండియా-గల్ఫ్ సెక్టార్‌లో జెట్ ఎయిర్‌వేస్ సర్వీసులు!

- October 17, 2022 , by Maagulf
త్వరలోనే ఇండియా-గల్ఫ్ సెక్టార్‌లో జెట్ ఎయిర్‌వేస్ సర్వీసులు!

దుబాయ్: దాదాపు మూడు సంవత్సరాల అనంతరం భారతదేశం-గల్ఫ్ సెక్టార్‌లో జెట్ ఎయిర్‌వేస్ తన కార్యాకలాపాలను తిరిగి ప్రారంభించే యోచనలో ఉన్నట్లు సమాచారం. జెట్ ఎయిర్‌వేస్ కొత్త మేనేజ్‌మెంట్ ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వ్యాపార వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇప్పటికే దానికి సంబంధించిన విమాన తయారీదారులతో కీలక చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. మొదటగా ఐదు విమానాలను నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం అయినట్లు కంపెనీ వర్గాలు చెబుతున్నారు. ఒకప్పుడు భారతదేశపు అతిపెద్ద ప్రైవేట్ విమానయాన సంస్థ అయిన జెట్ ఎయిర్ వేస్.. దాని వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ దివాలా తీసి 2019లో కార్యకలాపాలను నిలిపివేశారు. దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త మురారి లాల్ జలాన్, కల్‌రాక్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ ఛైర్మన్ ఫ్లోరియన్ ఆధ్వర్యంలోని కల్రాక్ క్యాపిటల్-మురారి లాల్ జలాన్ కన్సార్టియం ఎయిర్‌లైన్స్ కు మూలధనాన్ని  సమకూర్చడానికి రుణదాతలతో ఒప్పందాన్ని చేసుకోవడంతో జెట్ ఎయిర్ వేస్ సర్వీసులు దాదాపు మూడు సంవత్సరాల తర్వాత తిరిగి ప్రారంభం కానున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com