త్వరలోనే ఇండియా-గల్ఫ్ సెక్టార్లో జెట్ ఎయిర్వేస్ సర్వీసులు!
- October 17, 2022
దుబాయ్: దాదాపు మూడు సంవత్సరాల అనంతరం భారతదేశం-గల్ఫ్ సెక్టార్లో జెట్ ఎయిర్వేస్ తన కార్యాకలాపాలను తిరిగి ప్రారంభించే యోచనలో ఉన్నట్లు సమాచారం. జెట్ ఎయిర్వేస్ కొత్త మేనేజ్మెంట్ ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వ్యాపార వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇప్పటికే దానికి సంబంధించిన విమాన తయారీదారులతో కీలక చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. మొదటగా ఐదు విమానాలను నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం అయినట్లు కంపెనీ వర్గాలు చెబుతున్నారు. ఒకప్పుడు భారతదేశపు అతిపెద్ద ప్రైవేట్ విమానయాన సంస్థ అయిన జెట్ ఎయిర్ వేస్.. దాని వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ దివాలా తీసి 2019లో కార్యకలాపాలను నిలిపివేశారు. దుబాయ్కి చెందిన వ్యాపారవేత్త మురారి లాల్ జలాన్, కల్రాక్ క్యాపిటల్ మేనేజ్మెంట్ లిమిటెడ్ ఛైర్మన్ ఫ్లోరియన్ ఆధ్వర్యంలోని కల్రాక్ క్యాపిటల్-మురారి లాల్ జలాన్ కన్సార్టియం ఎయిర్లైన్స్ కు మూలధనాన్ని సమకూర్చడానికి రుణదాతలతో ఒప్పందాన్ని చేసుకోవడంతో జెట్ ఎయిర్ వేస్ సర్వీసులు దాదాపు మూడు సంవత్సరాల తర్వాత తిరిగి ప్రారంభం కానున్నాయి.
తాజా వార్తలు
- ట్రోఫీని హోటల్ గదికి తీసుకుకెళ్లిన పీసీబీ
- టీమిండియా విజయం సాధించడంపై ప్రధాని మోదీ హర్షం
- అమరావతిలో 12 బ్యాంకుల హెడ్ ఆఫీసులు..
- తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పుణే యూనివర్సిటీ, ఖతార్ క్యాంపస్ మొదటి బ్యాచ్ ప్రారంభం..!!
- పలు అంశాలపై చర్చించిన ఒమన్, బహ్రెయిన్..!!
- నవంబర్ 25 నుండి అరబ్ జ్యువెల్లరీ ఎగ్జిబిషన్..!!
- ఆధునిక సౌకర్యాలతో షువైక్ బీచ్ రెడీ..!!
- న్యూయార్క్ లో సౌదీ, భారత విదేశాంగ మంత్రులు భేటీ..!!
- కనువిందు..బుర్జ్ ఖలీఫాపై కోల్కతా ఫెస్టివల్ థీమ్..!!